hyderabadupdates.com movies వెడ్డింగ్ షో… మంచి టాక్ వాడకుంటే ఎలా

వెడ్డింగ్ షో… మంచి టాక్ వాడకుంటే ఎలా

నిన్న విడుదలైన వాటిలో ఎక్కువ శాతం బజ్ ఉన్నది రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ కే అయినా మరో చిన్న సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేసిన టీమ్ తామెందుకు కంటెంట్ ని అంత బలంగా నమ్మామో జనాలను మెప్పించడం ద్వారా ఋజువు చేసింది. అయితే ప్రమోషన్ల పరంగా వెడ్డింగ్ షో బృందం సరైన ప్రణాళిక వేసుకోకపోవడం వల్ల కామన్ ఆడియన్స్ కి ఇది రిలీజైన సంగతి, బాగుందనే టాక్ రెండూ రీచ్ కాలేకపోతున్నాయి. నిన్న పలు చోట్ల చాలా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న కారణంగా కొన్ని మల్టీప్లెక్సులు షోలు క్యాన్సిల్ చేయడమే దానికి సాక్ష్యం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెటింగ్ చాలా కీలకం. ఆ మధ్య లిటిల్ హార్ట్స్ కు ఎంత బడ్జెట్ అయ్యిందో అంత కన్నా ఎక్కువ పబ్లిసిటీకి ఖర్చు పెట్టారు. విపరీతమైన ప్రమోషన్లతో పబ్లిక్ కి చేరువయ్యారు. ఫలితంగా పది కోట్లు వస్తే చాలనుకుంటే ఏకంగా ముప్పై కోట్లు దాటేసి వావ్ అనిపించుకుంది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకు వచ్చిన సమస్య అలాంటి బలమైన స్ట్రాటజీ లేకపోవడం. నిర్మాత అనుభవలేమి ఇక్కడ అవరోధంగా మారిందని టాక్. తిరువీర్ తన మొహం చూసి ఓపెనింగ్స్ రావని, అందుకే ముందే స్పెషల్ షోలు వేశామని చెప్పడం తెలిసిందే. ఇప్పుడా పాజిటివ్ టాక్ ఎలా వాడుకోవాలనే దాని మీద దృష్టి పెట్టాల్సిందే.

ప్రేక్షకులు కూడా థియేటర్, ఓటిటి రెండింటిలో ఏ సినిమా దేంట్లో చూడాలనే దాని మీద ముందే క్లారిటీ తెచ్చేసుకుంటున్నారు. సో వాళ్ళను టికెట్లు కొనేలా చేయాలంటే తమ సినిమా బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ అనే సందేశం రిజిస్టర్ చేయాలి. ఇది చెప్పినంత ఈజీ కాదు. అలాని కష్టమూ కాదు. కేవలం ఇన్స్ టా రీల్స్ చేయించి, ట్వీట్లు వేయిస్తే సరిపోదు. వినూత్నంగా ఏదైనా ఆలోచించాలి. రెగ్యులర్ అనిపించినా సక్సెస్ మీట్లు గట్రా చేయాలి. వీలైతే సెలెబ్రిటీల సహాయం తీసుకుని వాళ్ళతో నాలుగు మంచి మాటలు చెప్పించాలి. అప్పుడు బుక్ మై షోలో ట్రెండింగ్ ఉంటుంది. ఇప్పుడు మౌనంగా ఉంటే వీకెండ్ వసూళ్లు రిస్క్ లో పడతాయి.

Related Post

రేటింగ్స్ కావాలి… అయితే ఇంద్ర వేయాలిరేటింగ్స్ కావాలి… అయితే ఇంద్ర వేయాలి

మాస్ సినిమాల వరకు దేశం మొత్తం మీద టాలీవుడ్ చూపించినంత ప్రభావం ఇంకే భాషా పరిశ్రమ చేయలేకపోయిందనేది వాస్తవం. ఎన్టీఆర్ అడవి రాముడుతో మొదలుపెట్టి అల్లు అర్జున్ పుష్ప దాకా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఉదాహరణలు కనిపిస్తాయి. ఘరానా మొగుడు