hyderabadupdates.com Gallery HAL: 113 తేజస్‌ జెట్‌ ఇంజిన్ల కొనుగోలుకు హాల్‌ ఒప్పందం

HAL: 113 తేజస్‌ జెట్‌ ఇంజిన్ల కొనుగోలుకు హాల్‌ ఒప్పందం

HAL: 113 తేజస్‌ జెట్‌ ఇంజిన్ల కొనుగోలుకు హాల్‌ ఒప్పందం post thumbnail image

 
 
కేంద్ర ప్రభుత్వ హిందుస్తాన్‌ ఏరో నాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) అమెరికా రక్షణ రంగ సంస్థ జనరల్‌ ఎలక్ట్రిక్‌(జీఈ) ఏరోస్పేస్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, ఎంకే1ఏ కార్యక్రమం కింద తేజస్‌ విమా నాలకు అవసరమైన 113 జెట్‌ ఇంజిన్లను కొను గోలు చేయనుంది. భారత ఉత్పత్తులపై ట్రంప్‌ ప్రభుత్వం 50% టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన వేళ ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. రూ.8,870 కోట్ల విలువైన ఈ ఒప్పందం ప్రకారం జీఈ ఏరోస్పేస్‌ సంస్థ ఎఫ్‌404–జీఈ–ఐఎన్‌ 20 రకం ఇంజిన్లను హెచ్‌ఏఎల్‌కు 2027–2032 సంవత్సరాల మధ్య అందజేయాల్సి ఉంటుంది.
 
చైనా విమాన వాహక యుద్ధనౌక ఫుజియాన్‌ ప్రారంభం
 
చైనా మూడో విమాన వాహక యుద్ధనౌక ఫుజియాన్‌ను రహస్యంగా ప్రారంభించింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హాజరయ్యారు. బుధవారం దక్షిణ చైనాలోని హైనన్‌ ప్రావిన్స్‌లో ఉన్న సాన్యా పోర్టులో జిన్‌పింగ్‌ జెండా ఊపి అత్యంత అధునాతన యుద్ధనౌకను ప్రారంభించారని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జిన్‌హువా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. అయితే అధికారిక మీడియా మాత్రం ఫుజియాన్‌ను శుక్రవారం ప్రారంభించారని తెలిపింది.
ఇంతకుముందు చైనా 2012లో లియావోనింగ్‌, 2019లో షాన్‌డాంగ్‌ విమాన వాహక యుద్ధ నౌకలను ప్రారంభించింది. వీటికన్నా ఫుజియాన్‌ పెద్దది. దీని బరువు 80 వేల టన్నులు. చైనా మిలిటరీ కమాండర్‌ సోంగ్‌ జోంగ్‌పింగ్‌ మాట్లాడుతూ ‘‘ఫ్లాట్‌ డెక్‌తో ఉన్న చైనా తొలి ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ ఇది. ఆధునిక పరిజ్ఞానంతో తయారైంది. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ క్యాటపుల్ట్స్‌, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ అరెస్టింగ్‌ గేర్‌, ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థ ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. అధునాతన ఫుజియాన్‌లో విద్యుదయస్కాంత విమాన ప్రయోగ వ్యవస్థ (ఈఎంఏఎల్‌ఎ్‌స)ను అమర్చారు. ఈ వ్యవస్థను అమెరికా విమాన వాహక యుద్ధనౌక యూఎస్ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌లో మాత్రమే వినియోగించారు. చైనా ప్రవేశపెట్టిన మూడు విమాన వాహక యుద్ధనౌకల్లో సంప్రదాయ ఇంధనాన్ని మాత్రమే వినియోగిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలోనే కాకుండా భారత్‌కు సమీపంలోని హిందూ మహాసముద్రంలోనూ, అరేబియా సముద్రంలోనూ ఫుజియాన్‌ను మోహరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
The post HAL: 113 తేజస్‌ జెట్‌ ఇంజిన్ల కొనుగోలుకు హాల్‌ ఒప్పందం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌

హైద‌రాబాద్ : ద‌ర్శ‌క‌, నిర్మాత వేణు ఉడుగుల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. త‌ను ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆపై నిర్మాత‌గా స‌క్సెస్ అయ్యాడు. అష్ట క‌ష్టాలు ప‌డి, అప్పులు చేసిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా తీశాడు. తాజాగా

Wife: ప్రియుడి కోసం భర్తను కాల్చి చంపిన భార్యWife: ప్రియుడి కోసం భర్తను కాల్చి చంపిన భార్య

  ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి గుట్టుగా నడుపుతున్న ప్రేమ వ్యవహారం ఆమె భర్తకు తెలిసింది. దీనిని గ్రహించిన ఆమె భర్త ఎక్కడ రచ్చ చేస్తాడోనని భయపడి, అతనిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రియుడి సాయం