hyderabadupdates.com Gallery CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు post thumbnail image

 
పెన్షన్ల పంపిణీకు డుమ్మా కొడుతున్న పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బందితో సమావేశం అయిన చంద్రబాబు… పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలకు సంబంధించి ఎమ్మెల్యేల హాజరు వివరాలు ఆరా తీసారు. ఈ సందర్భంగా 48 మంది ఎమ్మెల్యేలు… పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలకు సక్రమంగా హాజరుకావడం లేదని తెలుసుకుని అవాక్కయ్యారు. వెంటనే ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని కార్యాలయం సిబ్బందిని ఆదేశించారు.
 
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి – ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
 
ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ బ్యాక్ ఆఫీస్ విభాగాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు నిర్వహించే కార్యక్రమాలపై సీఎం చర్చించారు. ప్రజా సమస్యలు, వివిధ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కృషి చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే ప్రజావేదిక కార్యక్రమంలో కూడా పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.
 
ప్రజాప్రతినిధులు వారంలో ఒక రోజు ఖచ్చితంగా ప్రజావేదిక కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించాలని ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయిలో, అక్కడా పరిష్కారం కానివి రాష్ట్రస్థాయిలో పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు తీసుకోవడంతో పాటు తమకు వచ్చిన అర్జీలు పరిష్కారమయ్యే వరకు పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. అదే విధంగా ప్రతి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ ప్రతి నెల ఒకటో తేదీన ‘పేదల సేవలో పింఛన్ల పంపిణీ’ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
సీఎం చంద్రబాబుతో క్రమశిక్షణ కమిటీ భేటీ
టీడీపీ తిరువూరు నేతల మధ్య నెలకొన్న వివాదంపై రూపొందించిన నివేదికను సీఎం చంద్రబాబుకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ అందచేసింది. ఈ క్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. సీఎంతో కొనకళ్ల నారాయణ, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ తదితరులు సమావేశమయ్యారు. తిరువూరులో ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్నీ)ల మధ్య నెలకొన్న వివాదాలపై నివేదిక రూపొందించింది క్రమశిక్షణ కమిటీ. ఇటీవల ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకుంది కమిటీ. నేతలు ఇచ్చిన వివరణతో పాటు స్థానిక పరిస్థితులపై నివేదిక రూపొందించి అధినేత చంద్రబాబుకు అందచేసింది క్రమశిక్షణ కమిటీ. ఈ నేపథ్యంలో నివేదికను అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనున్నారు సీఎం చంద్రబాబు.
The post CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులివ్వాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Indigo: రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీస్ !Indigo: రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్‌ ఫ్లైట్ సర్వీస్ !

  విమాన ప్రయాణాలు చేసే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. విజయవాడ-సింగపూర్‌ మార్గంలో నవంబర్‌ 15 నుంచి ఇండిగో సంస్థ తన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీసును ప్రారంభించనుంది. ఈ సర్వీస్‌ మొదలైతే విజయవాడ నుంచి సింగపూర్‌ వెళ్లాలనుకునే ప్రయాణికులకు

జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అరుదైన ఘ‌న‌త సాధించారు. ఆయ‌న బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. సినీ రంగంలో నటుడిగా చెరగని ముద్ర వేశారు. నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, కొరియోగ్రాఫర్

Prashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసుPrashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసు

    ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పై వైశాలి జిల్లాలోని రఘోపూర్ లో కేసు నమోదైంది. రఘోపూర్ ప్రాంతంలో ప్రశాంత్ కిషోర్ శనివారంనాడు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనంతరం ఆయనపై