hyderabadupdates.com movies రోషన్ చేసింది తెలివైన పనే

రోషన్ చేసింది తెలివైన పనే

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో పరిచయమైన రోషన్ మేక డిసెంబర్ 25 ఛాంపియన్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. వైజయంతి బ్యానర్ నిర్మాణం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించడం బిజినెస్ పరంగా హెల్ప్ అవుతోంది. ఇదిలా ఉండగా కెరీర్ పరంగా చాలా నెమ్మదిగా ఉన్న రోషన్ తన రెండో సినిమాకు ఇంత గ్యాప్ తీసుకోవడం కరెక్ట్ కాదనేది నిజం. అయితే తను గత ఏడాదే మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభలో నటించేందుకు ఒప్పుకున్నాడు. అధికారిక ప్రకటన వచ్చింది. కొంత భాగం షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు.

తర్వాత తను ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. విపరీతమైన జాప్యంతో పాటు పలు కారణాలు దీనికి దారి తీశాయని మల్లువుడ్ టాక్. ఇదంతా ఇప్పుడు జరిగింది కాదు. నెలల క్రితమే రోషన్ స్థానంలో కన్నడ నటుడు సమర్జిత్ ని తీసుకుని రీ షూట్ చేసి మిగిలిన భాగం పూర్తి చేశారు. రిలీజ్ ని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చిన వృషభ కొత్త డేట్ డిసెంబర్ 25. అంటే సరిగ్గా ఛాంపియన్ వస్తున్న అదే రోజు. వృషభలో మోహన్ లాల్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. రెండో పాత్ర పేరు విశ్వంభర కావడం గమనార్హం. తండ్రి కొడుకుల మధ్య ఈగో వార్ గా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నారు.

ఇదంతా పక్కనపెడితే మోహన్ లాల్ సినిమాలో ఛాన్స్ వదులుకోవడం పైకి కరెక్ట్ కాదని అనిపించినా కెరీర్ ప్రారంభంలో హీరో కొడుకు లాంటి పాత్రలు చేయకపోవడమే బెటర్. ఒక స్థాయికి వచ్చాక ట్రై చేయొచ్చు కానీ రోషన్ ఇంకా నటుడిగా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. అందుకే ఛాంపియన్ కూడా ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉన్నా ఓపిగ్గా సహకరించి వేరే కమిట్ మెంట్స్ ఇవ్వకుండా ఎదురు చూశాడు. ఒకవేళ వృషభలో కనక నిడివి తక్కువ ఉంటే లేనిపోని నెగటివ్ కామెంట్స్ వచ్చేవి. ఛాంపియన్ సక్సెస్ తర్వాత స్పీడ్ పెంచేందుకు కుర్రాడు రెడీగా ఉన్నాడట. చూడాలి అంతగా ఏముందో.

Related Post

బూతుకి బోల్డుకి తేడా ఉంది నిజమే కానీబూతుకి బోల్డుకి తేడా ఉంది నిజమే కానీ

కొన్ని నెలల క్రితం మాస్ జాతర నుంచి ఓలే ఓలే లిరికల్ సాంగ్ వచ్చినప్పుడు అందులో బూతుల గురించి పెద్ద డిబేటే జరిగింది. దానికి స్పందించే అవకాశం టీమ్ కి దొరకలేదు కానీ, రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాక ప్రమోషన్లు మొదలు

ట్రైలర్ టాక్: మోస్ట్ లవ్డ్ మ్యాన్ ఈజ్ బ్యాక్ట్రైలర్ టాక్: మోస్ట్ లవ్డ్ మ్యాన్ ఈజ్ బ్యాక్

ఇండియన్ వెబ్ సిరీస్ హిస్టరీలో ది బెస్ట్ ఏదంటే.. ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే ఎక్కువమంది సమాధానం ఇస్తారు. థ్రిల్స్‌కు, థ్రిల్స్.. ఎంటర్టైన్మెంట్‌కు ఎంటర్టైన్మెంట్.. ఈ రెండు విధాలా ఈ సిరీస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. 2019లో వచ్చిన తొలి సీజన్ సూపర్ హిట్