hyderabadupdates.com Gallery KTR: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ – కేటీఆర్

KTR: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ – కేటీఆర్

KTR: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ – కేటీఆర్ post thumbnail image

 
 
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక రెండే పార్టీల మధ్య జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఆరు గ్యారంటీలను ఎగ్గొట్టి, పేదవాడి గూడు కూలగొట్టి, వాళ్ల నడుం విరగ్గొట్టి ఉపాధి లేకుండా చేస్తున్న కాంగ్రెస్‌కు… పేదవాడి కోసం ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీస్తున్న బీఆర్ఎస్ కు మధ్య జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ కారుకి, కాంగ్రెస్‌ బుల్డోజర్‌ మధ్య జరుగుతున్న ఎన్నికని అభివర్ణించారు. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్‌లో శనివారం నిర్వహించిన రోడ్‌ షోలో కేటీఆర్‌ ప్రచారం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘ఎర్రగడ్డకు వచ్చి ఒక్క అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి అడుగుతున్నారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకే అన్ని వర్గాలను మోసం చేశారు. ఒక్కసారి మోసపోతే తప్పు వారిది. మళ్లీ మళ్లీ మోసపోతే తప్పు మనదవుతుంది. 420 హామీలు ఇచ్చి, దళితులు, బీసీలు, గిరిజన డిక్లరేషన్లు ప్రకటించి… ఒక్కటీ నెరవేర్చలేదు. భారాస అభ్యర్థి మాగంటి సునీతను గెలిపిస్తే, మా చేతికి తల్వార్‌ ఇస్తే… ఎవరైనా పేదల ఇళ్లు కూలగొట్టడానికి వస్తే కొట్లాడతాం. హైడ్రా ఎప్పుడు ఏ గల్లీకి వచ్చి ఇళ్లు కూల్చేస్తుందో చెప్పలేం.
 
కత్తి ఎవరికో ఇచ్చి మమ్మల్ని కొట్లాడమంటే కష్టం. హైడ్రా రాక్షసిని మేం ఊరికే వ్యతిరేకించటం లేదు. పేదల ఇళ్లు కూలగూడుతున్న హైడ్రా… పెద్దల ఇళ్ల జోలికి పోవడం లేదు. హైదరాబాద్‌లో కేసీఆర్‌ లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టారు. రెండేళ్లయినా రేవంత్‌ ఒక్క ఇల్లు కట్టారా? జూబ్లీహిల్స్‌లో ఎన్ని రోడ్లు వేశారో, హైదరాబాద్‌లో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టారో చెప్పాకే ఆయన ఓట్లడగాలి. ముస్లింలలో పేదలున్నారని కాంగ్రెస్‌ అంటోంది. దేశంలో అత్యధిక సార్లు అధికారం చెలాయించింది కాంగ్రెస్‌ పార్టీనే కదా… ఇన్నాళ్లు ఏం చేసింది? బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో 204 మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేశాం. షాదీముబారక్‌ అమలు చేశాం.
 
కాంగ్రెస్‌ పార్టీ షేక్‌పేటలో ఓటుకు రూ.5 వేలు, బోరబండలో రూ.6 వేలు, అభ్యర్థి ఉండే ప్రాంతం కావడంతో యూసుఫ్‌గూడలో ఓటుకు రూ.8 వేలు ఇస్తోంది. రూ.5 వేలు ఇస్తే బాకీపడిన పింఛను సొమ్ము రూ.55 వేలు ఎప్పుడు ఇస్తారని అడగండి. ఓట్లను నోట్లతో కొనుక్కొని బీఆర్ఎస్ ను ఓడగొట్టాలని కాంగ్రెస్‌ నేతలు చూస్తున్నారు. బెదిరించి, ఇళ్లు కూలగొడతామని చెప్పి షరీఫ్‌ వంటి నాయకులకు కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి సంబరపడుతున్నారు. సర్వేలో ఓడిపోతుందని తెలియగానే అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చింది. ఓడగొడితే కచ్చితంగా మహిళలకు రూ.2,500, పెద్దలకు రూ.4 వేల పింఛన్‌ వంటి హామీలు అమలవుతాయి. ఆకు రౌడీలు, గూండాల బెదిరింపులకు ఎవరూ భయపడవద్దు. కొందరు పోలీసులు అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నారు. నఖరాలు చేస్తే తోక కత్తిరించే బాధ్యత తీసుకుంటాను’’ అని కేటీఆర్‌ అన్నారు.
 
‘‘మాగంటి గోపీనాథ్‌ ఎప్పుడు నిలబడినా మంచి మెజారిటీతో గెలిపించారు. ఆయన ఆశయాలతో వచ్చిన నాకు ఎక్కువ మెజారిటీ వచ్చేలా ప్రతిఒక్కరూ అండగా నిలవాలి. గడప గడపకు వెళ్తున్న నా పిల్లలపై, నాపై కూడా కేసులు పెట్టడాన్ని రాజకీయం అంటారా? బాధతో ఏడిస్తే దొంగ ఏడుపు అంటారా?’’ అని మాగంటి సునీత ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పి.విష్ణువర్ధన్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, కోనేరు కోనప్ప, క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సలీం, పార్టీ నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.
 
తెలంగాణ అభివృద్ధిపై నాకు మీ సర్టిఫికెట్‌ అవసరం లేదు – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
 
తెలంగాణలో బీఆర్ఎస్ అసలు ఆట ఇంకా మొదలు కాలేదని, ఆట మొదలుపెట్టాక కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల కింద ఉన్న భూమి కదులుతుందని, రానున్న రోజుల్లో అసలు ఆట మొదలు పెట్టి భాజపా సత్తా ఏంటో చాటుతామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఓడిపోతుందనే భయంతో రేవంత్‌రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మధురానగర్‌లో ఎన్నికల సభలోనూ ప్రసంగించారు. ‘‘మిస్టర్‌ రేవంత్‌రెడ్డీ.. నేను భయపడను. మీరు గతంలో ఇచ్చిన హామీల గురించి జవాబు చెప్పకుండా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తారా? తెలంగాణ అభివృద్ధి విషయంలో నాకు మీ సర్టిఫికెట్‌ అవసరం లేదు. గత ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా రాహుల్‌ గాంధీ, మీరు బీఆర్ఎస్ దోచుకున్న రూ. లక్ష కోట్ల అవినీతి సొమ్ము కక్కిస్తామన్నారు. లక్ష రూపాయలు కూడా కక్కించలేదు.
కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులపై చర్చకు వస్తారా?
బీజేపీకు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ, కేజ్రీవాల్‌ కలిసి రావాలని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండు ఒకటే అనడానికి ఈ మాటలే నిదర్శనం. గత పదకొండేళ్లలో బీజేపీ రాష్ట్రానికి, హైదరాబాద్‌కు ఏమేం ప్రాజెక్టులు తెచ్చిందో చెబుతా. రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌.. మీకు వినే దమ్ము, ధైర్యం ఉందా? ట్యాంకుబండ్, ప్రెస్‌ క్లబ్‌.. ఇలా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. చర్చకు వస్తారా? తెలంగాణ రాజకీయాలను బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్‌ మూడు కుటుంబ పార్టీలు శాసిస్తున్నాయి.
The post KTR: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ – కేటీఆర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Nayanar Nagendran: మా కూటమిలోకి విజయ్‌ వస్తే స్వాగతిస్తాం – బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌Nayanar Nagendran: మా కూటమిలోకి విజయ్‌ వస్తే స్వాగతిస్తాం – బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌

    తమ కూటమిలోకి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌ వస్తే ఘనంగా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీపీ రాధాకృష్ణన్‌ ఈ నెల 28న కోవైలో

Rohini Acharya: దమ్ముంటే కిడ్నీ దానమిచ్చి చర్చకు రండి – లాలూ కుమార్తె రోహిణి ఆచార్యRohini Acharya: దమ్ముంటే కిడ్నీ దానమిచ్చి చర్చకు రండి – లాలూ కుమార్తె రోహిణి ఆచార్య

      ఆర్జేడీ సుప్రీం నేతగా పార్టీ శ్రేణుల గుండెల్లో నిలిచిపోయిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఒక కిడ్నీ దానంచేసే దమ్ములేని వాళ్లు నాపై నిందలు వేస్తున్నారని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తండ్రి మీద అచంచల

Delhi: ఢిల్లీ పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలుDelhi: ఢిల్లీ పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు

    ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనతో కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అయితే, ఈ ఘటనలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బాంబు బ్లాస్ట్ ఘటనలో ఇప్పటివరకు