hyderabadupdates.com Gallery Murder: రామచంద్రాపురంలో బాలిక మృతి ఘటనలో వీడిన మిస్టరీ

Murder: రామచంద్రాపురంలో బాలిక మృతి ఘటనలో వీడిన మిస్టరీ

Murder: రామచంద్రాపురంలో బాలిక మృతి ఘటనలో వీడిన మిస్టరీ post thumbnail image

 
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రామచంద్రాపురంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మైనర్ బాలిక కేసులో మిస్టరీ వీడింది. ఈ నెల 4న తన ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ బాలిక మృతదేహం కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. బాలికను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మిస్టరీగా మారిన ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు… పలు కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేసి ఎట్టకేలకు నిందితుడ్ని అరెస్ట్ చేసారు. బాలిక మృతికి సంబంధించిన వివరాలను ఎస్పీ రాహుల్‌ మీనా మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ… ‘‘బాలిక హత్యకు సంబంధించి కేసు నమోదు చేశాం. నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేశాం. బాలిక ఉండే భవనంలోనే జిరాక్స్‌ షాపులో అతడు పనిచేసేవాడు. ఆర్థిక సమస్యలతో నిందితుడు తీవ్ర ఒత్తిడిలోఉన్నాడు. అతడి చెల్లి పెళ్లికి సంబంధించి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. నాలుగో తేదీ సాయంత్రం 4.30 గంటలకు బాలిక స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చింది. సాయంత్రం 5 గంటలకు బాలిక ఇంటికి శ్రీనివాస్‌ వెళ్లాడు. ఆమె తల్లి లేదని గ్రహించి చోరీ చేయాలనుకున్నాడు. గతంలోనూ బాలిక ఇంటికి ఇతర పనులకు సంబంధించి వెళ్లేవాడు. అక్కడి బెడ్‌రూమ్‌లో విలువైన వస్తువులు ఉన్నాయి. ఈక్రమంలో ఇంట్లోకి ఎందుకు వచ్చావని బాలిక నిందితుడిని ప్రశ్నించింది. తన తల్లికి విషయం చెప్పాలని ప్రయత్నించింది.
ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాస్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి… తలగడతో ఊపిరాడకుండా చేసి హత్య చేసాడు. అనంతరం ఆమెను సీలింగ్ ఫ్యాన్ కు వేలాడ దీసి… ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నాడు. ‌ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూనే… యూట్యూబర్ గా కూడా పాపులారిటీ సంపాదించిన శ్రీనివాస్… బాలిక మృతి తరువాత… ఆమె కుటుంబ సభ్యులు, పోలీసుల వెనుక తిరుగుతూ విచారణను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించాడు. అయితే బాలిక అనుమానాస్పద మృతికి సంబంధించి… ఆ ఇంటి యజమానిని అదుపులోనికి తీసుకుని ప్రశ్నించగా… ఎలక్ట్రీషియన్ శ్రీనివాస్ కూడా తరచూ ఆ ఇంటికి వచ్చేవాడని అనుమానం వ్యక్తం చేయడంతో… అతడ్ని అదుపులోనికి తీసుకుని తనదైన శైలిలో ప్రశ్నించగా… నేరాన్ని ఒప్పుకున్నాడు.
శ్రీనివాస్ కు సంబంధించి ఫింగర్ ప్రింట్‌ ఘటనాస్థలిలో దొరికింది. బాలికను అతడే హత్య చేసినట్లు నిర్ధరించాం. సీడీఆర్‌, సీసీటీవీ పరిశీలిస్తే నిందితుడి లోకేషన్‌ అదే ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది. మిగతా వారిని విచారించి శ్రీనివాస్‌ను పట్టుకున్నాం. ఆధారాల మేరకు అరెస్టు చేశాం. మరో మెడికల్ రిపోర్టు రావాల్సి ఉంది.. సాంకేతిక ఆధారాల కోసం చూస్తున్నాం.’’ అని ఎస్పీ తెలిపారు.
The post Murder: రామచంద్రాపురంలో బాలిక మృతి ఘటనలో వీడిన మిస్టరీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

“Telangana Cabinet’s Surprise Move—All Eyes on the Court”“Telangana Cabinet’s Surprise Move—All Eyes on the Court”

People anticipated clear decisions on local body elections and BC reservations in Thursday’s state cabinet meeting. The meeting, held at the Secretariat, was chaired by Chief Minister Revanth . The

Vijaya Shanti Reflects on Landmark Film Pratighatana on Its 40th AnniversaryVijaya Shanti Reflects on Landmark Film Pratighatana on Its 40th Anniversary

Lady Superstar Vijaya Shanti’s iconic film Pratighatana, produced by Ushakiran Movies, celebrated its 40th anniversary recently. Released on October 11, 1985, the film created a major sensation at the time