hyderabadupdates.com movies ‘శివ’ రహస్యం బయట పెట్టేశారు

‘శివ’ రహస్యం బయట పెట్టేశారు

టాలీవుడ్ గమనాన్ని మార్చిన అతి కొద్ది సినిమాల్లో శివ స్థానం చాలా ప్రత్యేకం. నాగార్జున ఈ రోజు ఇంత స్టార్ డం చూశారంటే దానికి బలమైన పునాది వేసింది ఈ కల్ట్ క్లాస్సిక్కే. రామ్ గోపాల్ వర్మ అనే సునామీని పరిచయం చేసింది కూడా శివనే. అందుకే అక్కినేని ఫ్యాన్స్ దీన్ని స్పెషల్ గా చూస్తారు. 36 సంవత్సరాల తర్వాత శివ రీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నెలల తరబడి ప్రింట్, సౌండ్ మీద వర్క్ చేసింది. దాని ఫలితం తెరమీద గొప్పగా కనిపిస్తోంది. మీడియాకు వేసిన స్పెషల్ షోలో క్వాలిటీ చూసిన వాళ్ళు అబ్బురపడిపోయారు.  

ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో శివకు సంబంధించిన ఒక రహస్యం రామ్ గోపాల్ వర్మ బయట పెట్టేశారు. అంటే కథకు ఎలా అంకురార్పణ జరిగిందనే దాని గురించి. దర్శకుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టిన కొత్తలో వర్మ దగ్గర రాత్రి స్క్రిప్ట్ ఒకటే ఉంది. స్టార్ తో చేయాలా లేక కొత్తవాళ్లతోనా అనే మీమాంస కొనసాగుతోంది. సరిగ్గా అప్పుడే అక్కినేని వెంకట్ కలిసి నాగార్జునకు సూటయ్యే స్టోరీ రాయమని సలహా ఇచ్చారు. దీంతో తన ఫేవరెట్ బ్రూస్ లీ రిటర్న్ అఫ్ ది డ్రాగన్ పదిహేనోసారి చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మకు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఆ మూవీలో క్యాంటీన్ తీసి కాలేజీగా మార్చేశారు.

విజయవాడ కాలేజీలో చదివినప్పటికీ తన అనుభవాలు జోడించి శివని రెడీ చేశారు. ఆ రకంగా శివకు ఇన్స్ పిరేషన్ బ్రూస్ లీ అన్నమాట. వర్మకు హాలీవుడ్ మూవీస్ మీద ఉన్న ప్యాషన్ ఎంతగా ప్రభావితం చేసిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 1989లో ఇప్పట్లా ఓటిటిలు యూట్యూబ్ లు లేవు కాబట్టి ఇంగ్లీష్ సినిమాలు చూసే అవకాశాలు తక్కువగా ఉండేవి. కాబట్టి శివకు, రిటర్న్ అఫ్ ది డ్రాగన్ కు పోలికలు గుర్తుపట్టలేకపోయి ఉండొచ్చు. సరే ఎక్కడి నుంచి స్ఫూర్తి తీసుకుంటేనేం ఎందరో ఫిలిం మేకర్స్ కి మార్గదర్శిగా నిలిచిన శివ ఇప్పుడే కాదు ఇంకో యాభై వంద సంవత్సరాల తర్వాత కూడా కల్ట్ స్టేటస్ లోనే ఉంటుంది.

Related Post

Prakash Raj Slams Bollywood, Praises South Cinema’s Honest StorytellingPrakash Raj Slams Bollywood, Praises South Cinema’s Honest Storytelling

Veteran actor Prakash Raj has once again sparked discussion in film circles with his strong comments on the current state of Hindi cinema. Speaking candidly, the National Award–winning actor said