hyderabadupdates.com movies సిట్ దూకుడు.. జగన్ బాబాయికి నోటీసులు!

సిట్ దూకుడు.. జగన్ బాబాయికి నోటీసులు!

తిరుపతి కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డికి ఈరోజు నోటీసులు ఇచ్చింది. ఈనెల 13వ తేదీ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు కల్తీ నిజమని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ బృందం తేల్చింది. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో లడ్డూ తయారీకి బోలే బాబా డెయిరీ నుంచి సరఫరా అయిన నెయ్యి రసాయనాలతో తయారు చేసిందని దర్యాప్తు బృందం తేల్చింది. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చారు.

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగింది అని 2024 ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ సమయంలో అన్ని వేళ్లు వైసీపీ హయాం నాటి టిటిడి చైర్మన్లు గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వైపు చూపించాయి.

ఆ సమయంలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టీ చంద్రబాబు గారు టీటీడీ ప్రతిష్ట మంట గలుపుతున్నారు అని అటువంటి కల్తీ కి ఆస్కారం లేదు అని ప్రకటించారు. తమ చిన్నాన్న ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకునే గొప్ప ఆధ్యాత్మిక వేత్త అని.. ఆయన ” సూపర్ స్వామి” అని తన చిన్నాన్నను సమర్థించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయనకు సిట్ నోటీసులు ఇవ్వడం వైసీపీలో కలకలం రేగింది.

Related Post

నితిన్… ఇదీ వదిలేశాడా?నితిన్… ఇదీ వదిలేశాడా?

ఒకప్పుడు వరుసగా డజనుకు పైగా ఫ్లాపులు ఎదుర్కొని ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయే పరిస్థితుల్లో ‘ఇష్క్’ మూవీతో ఊపిరి పీల్చుకున్నాడు నితిన్.  ఆ తర్వాత అతను జాగ్రత్తగానే అడుగులు వేశాడు. గుండె జారి గల్లంతయ్యిందే, అఆ, భీష్మ లాంటి విజయాలతో తన కెరీర్ బాగానే

Mithali Raj Reveals Shocking Truth About Women’s Cricket Pay in 2005!Mithali Raj Reveals Shocking Truth About Women’s Cricket Pay in 2005!

In a recent media interaction, legendary Indian cricketer Mithali Raj shared a shocking revelation about the financial struggles faced by women cricketers in the past. She recalled that after India

కాంతార.. ఇక్కడ రికార్డ్.. అక్కడ లాస్కాంతార.. ఇక్కడ రికార్డ్.. అక్కడ లాస్

మొత్తానికి ‘కాంతార: చాప్టర్-1’ సాధించింది. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌గా ఈ కన్నడ సినిమా నిలుస్తుందా లేదా అనే సస్పెన్సుకు తెరపడింది. ఎట్టకేలకు ‘కాంతార: చాప్టర్-1’ ఆ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన బాలీవుడ్ మూవీ ‘ఛావా’ రూ.807