hyderabadupdates.com movies పెద్ది… అప్పుడు కొంచెం తగ్గాల్సిందే!!

పెద్ది… అప్పుడు కొంచెం తగ్గాల్సిందే!!

సోషల్ మీడియానే కాదు యావత్ మూవీ లవర్స్ నే ఊపేస్తున్న చికిరి చికిరి పాట మాములుగా వెళ్లట్లేదు. లక్షల కొద్ది రీల్స్, ట్వీట్స్ తో ఎక్కడ చూసినా దీని గురించిన చర్చే కనిపిస్తోంది. బాలీవుడ్ సర్కిల్స్ లో పుష్ప తర్వాత డిస్ట్రిబ్యూషన్ పరంగా అంత డిమాండ్ ఏర్పడే సినిమాగా పెద్దినే అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఏఆర్ రెహమాన్ నుంచి ఈ రేంజ్ క్లాస్ మాస్ ట్యూన్ ఎక్స్ పెక్ట్ చేయని సంగీత ప్రియులు తమ ఆరాధ్య ఏఆర్ఆర్ కంబ్యాక్ ఇచ్చినందుకు సంతోష పడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి సెకండ్ సింగల్ మీద ఉంది. ఇన్ సైడ్ టాక్  ప్రకారం డిసెంబర్ ముప్పై ఒకటి న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట.

కానీ మెగా ఫ్యాన్స్ పెద్ది అప్డేట్స్ అప్పుడు వద్దంటున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి కేవలం రోజుల గ్యాప్ లో మన శంకరవరప్రసాద్ గారు రిలీజ్ ఉంటుంది. సో చిరంజీవి మేనియానే ఉండాలనేది వాళ్ళ కోరిక. ఎలాగూ ప్రమోషన్లకు ప్రాణం పెట్టే దర్శకుడు అనిల్ రావిపూడి ఆ టైంలో పబ్లిసిటీని ఎంత పీక్స్ కు తీసుకెళ్తాడో తెలిసిందే. అలాంటప్పుడు పెద్దితో క్లాష్ ఏమంత సేఫ్ కాదు. అసలు మన శంకరవరప్రసాద్ గారులోని చిరంజీవి వెంకటేష్ కాంబో సాంగ్ నే ఆ రోజు రిలీజ్ చేసే ఆలోచన ఉందట. అలాంటప్పుడు ఇలా పరస్పరం కవ్వించుకోవడం బాగుండదు. కాబట్టి పెద్ది ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే.

మరో ముఖ్యమైన విషయం ఉస్తాద్ భగత్ సింగ్ తొలి పాట కూడా న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఇవ్వాలనేది మైత్రి దగ్గర ఉన్న ప్రతిపాదన. అది కూడా పైన చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన పాట షూట్ కూడా చేసేశారు. ఆ స్పెషల్ సాంగ్ నే కానుకగా ఇవ్వాలనేది ఒక ప్రపోజల్. మొత్తానికి ఈ మెగా ట్రయాంగిల్ వార్ ఏదో ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఎలా చూసినా చిరు టీమ్ నుంచి వచ్చే కంటెంట్ ఒకటే ఆ సమయంలో సబబుగా ఉంటుంది. ఇంకో యాభై రోజులు టైం ఉంది కాబట్టి ఈలోగా ఏమేం జరుగుతాయో, ఎవరెవరు ప్రణాళికలు మార్చుకుంటారో లెట్ వెయిట్ అండ్ సి.

Related Post

Ghantasala The Great Musical Night Celebrates a Timeless LegendGhantasala The Great Musical Night Celebrates a Timeless Legend

The enduring legacy of legendary playback singer Ghantasala was celebrated with grandeur at the “Ghantasala The Great Special Musical Night,” a star-studded event that brought together music lovers and film

మణిరత్నం ప్రేమకథలో వాళ్లిద్దరూమణిరత్నం ప్రేమకథలో వాళ్లిద్దరూ

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో మణిరత్నం ఒకరు. నాయకుడు.. ఘర్షణ.. గీతాంజలి.. రోజా.. బొంబాయి.. ఇద్దరు.. దిల్ సే.. సఖి.. యువ.. లాంటి ఎన్నో క్లాసిక్స్‌తో భారతీయ ప్రేక్షకులను ఉర్రూతలూగించారాయన. తర్వాతి కాలంలో మణిరత్నం ఫ్లాపులు ఇచ్చారు కానీ..