బిహార్‌లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడి కానుండగా… ఆయా సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. వీటిలో ఎక్కువగా అధికార ‘ఎన్డీయే’కు బిహారీలు మరోసారి పట్టం కట్టనున్నట్లు పేర్కొన్నాయి. అధికార పక్షానికి మెజార్టీ మార్కు 122 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని దాదాపు అన్ని సర్వేలు అంచనాకు వచ్చాయి. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్‌సురాజ్ పార్టీ అంతగా ప్రభావం చూపలేదని తెలిపాయి.
బిహార్‌లో అధికార ఎన్డీయే 133-159 స్థానాల్లో విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. మహాగఠ్‌బంధన్‌కు 75-101 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీకి 0-5 స్థానాలు, ఇతరులు 2-8 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేసింది.
దైనిక్ భాస్కర్ ఎన్డీయేకు 145-160 సీట్లు, మహాగఠ్‌బంధన్‌కు 73-91 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఎన్డీయేకు 147-167, విపక్షాలకు 70-90 స్థానాలు, ఇతరులకు 2-8 స్థానాలు వస్తాయని మ్యాట్రిజ్ అంచనా వేసింది. పీపుల్స్ ఇన్‌సైట్ కూడా ఎన్డీయేకు 133-148, విపక్షాలకు 87-102 సీట్లు, ఇతరులకు 3-6 వస్తాయని పేర్కొంది. జన్‌సురాజ్ పార్టీ 0-2 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని తెలిపాయి.
The post Bihar Exit Polls: బిహార్ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయేకే తిరిగి పట్టం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Bihar Exit Polls: బిహార్ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయేకే తిరిగి పట్టం
Categories: