hyderabadupdates.com Gallery Amit Shah: దిల్లీ పేలుళ్ళ వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడతాం – అమిత్‌ షా

Amit Shah: దిల్లీ పేలుళ్ళ వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడతాం – అమిత్‌ షా

Amit Shah: దిల్లీ పేలుళ్ళ వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడతాం – అమిత్‌ షా post thumbnail image

 
 
దిల్లీ పేలుడు ఘటన వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడాలని ఆదేశించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఎర్రకోట సమీపంలో పేలుడు నేపథ్యంలో.. దేశ రాజధాని దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతపై నేడు ఉన్నతాధికారులతో రెండు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పేలుడు అనంతర పరిస్థితులను ఉన్నతాధికారులు ఈ సందర్భంగా కేంద్రమంత్రికి వివరించారు.
‘‘దిల్లీ కారు పేలుడుపై సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాను. ఈ ఘటన వెనుక ఉన్న ప్రతి నిందితుడిని వేటాడాలని వారికి ఆదేశించాను. ఈ పేలుడులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతాయి’’ అని సమావేశాల అనంతరం అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ఈ ఘటనపై అత్యున్నత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని, సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాయని అంతకుముందు చెప్పారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ ఈ పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
 
ఉదయం నిర్వహించిన భేటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్, దిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ వర్చువల్‌గా హాజరయ్యారు. రెండో సమావేశంలోనూ దాదాపు ఈ ఉన్నతాధికారులే పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
The post Amit Shah: దిల్లీ పేలుళ్ళ వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడతాం – అమిత్‌ షా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నీరుగార్చిన మోదీ స‌ర్కార్ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నీరుగార్చిన మోదీ స‌ర్కార్

అమ‌రావ‌తి : మోదీ స‌ర్కార్ నిర్వాకంపై , అనుస‌రిస్తున్న విధానాల‌పై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్ర 6 వ రోజు శ‌నివారం

Anil Ambani: రూ.7,500 కోట్ల విలువైన అనిల్‌ అంబానీ ఆస్తులను జప్తు చేసిన ఈడీAnil Ambani: రూ.7,500 కోట్ల విలువైన అనిల్‌ అంబానీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

    అనిల్‌ అంబానీ రిలయన్స్‌ గ్రూప్‌ సంస్థలకు సంబంధించిన రూ.7,500 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో ఈ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు అక్టోబరు 31న ఈడీ ప్రకటించింది. ఈ ఆస్తుల్లో అనిల్‌ అంబానీ

Minister Srinivas Reddy: పత్తి రైతులను ఆదుకుంటాం – మంత్రి పొంగులేటిMinister Srinivas Reddy: పత్తి రైతులను ఆదుకుంటాం – మంత్రి పొంగులేటి

    ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకుంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం గోల్‌తండలో 2025 వానాకాలం సీజన్‌కు సంబంధించి సీసీఐ తొలి కేంద్రాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు.