hyderabadupdates.com movies బుచ్చిబాబు మీద బాలీవుడ్ కన్ను

బుచ్చిబాబు మీద బాలీవుడ్ కన్ను

తెలుగు తమిళంలో ఎవరైనా దర్శకులు బ్లాక్ బస్టర్లు కొట్టినా, ఫేమ్ తెచ్చుకున్నా ఆటోమేటిక్ గా బాలీవుడ్ కళ్ళలో పడటం సహజం. లేదంటే అట్లీతో షారుఖ్ ఖాన్ జవాన్ సాధ్యమయ్యేది కాదు. సుజిత్ ఒప్పుకోలేదు కానీ లేదంటే ఈ అవకాశం ఓజి కన్నా ముందు సుజిత్ కే వచ్చేది. కబీర్ సింగ్ చూశాకే సందీప్ రెడ్డి వంగా మీద నమ్మకం ఏర్పడి రన్బీర్ కపూర్ ప్రాణం పెట్టి యానిమల్ చేశాడు. షాహిద్ కపూర్ మన గౌతమ్ తిన్ననూరిని నమ్మి జెర్సీ చేసినా, రాజ్ కుమార్ రావు హిట్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో చేతులు కలిపినా ఇదంతా సక్సెస్ మహాత్యమే. అయితే ఉప్పెన అయ్యాక బుచ్చిబాబు మీద హిందీ మేకర్స్ దృష్టి పడలేదు.

కానీ ఇప్పుడు లెక్క మారుతోంది. పెద్దిలో చికిరి చికిరి సాంగ్ చేస్తున్న సెన్సేషన్, సినిమా మేకింగ్ గురించి లీకవుతున్న ఇన్ ఫుట్స్ అంతకంతా బుచ్చిబాబు రేంజ్ ని పెంచేస్తున్నాయి. దీంతో పలు ముంబై హ్యాండిల్స్ బుచ్చిబాబుకి షారుఖ్ ఖాన్ కు ముడిపెట్టి ఈ కాంబోలో ఒక మూవీ వస్తుందని, చైల్డ్ సెంటిమెంట్ ఆధారంగా రూపొందే ఈ సినిమా కోసం కింగ్ ఖాన్ విభిన్నమైన గెటప్స్ ట్రై చేస్తున్నాడని ఏదేదో వండి వారుస్తున్నారు. నిజానికి బుచ్చిబాబుకి ఇప్పుడు పెద్ది తప్ప వేరే ప్రపంచం లేదు. దాని పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి ఫస్ట్ కాపీ చేతికి వచ్చేదాకా సరిగ్గా భోజనం కూడా చేసేలా లేడు. అంత కమిట్ మెంట్ తో కస్టపడుతున్నాడు.

సో ఎలా చూసుకున్న బుచ్చిబాబు నెక్స్ట్ మూవీ గురించి అప్పుడే ఒక అంచనాకు రాలేం. అయితే మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ ద్వారా తన వర్కింగ్ స్టైల్ తెలుసుకున్న మహేష్ బాబు ఏదైనా కథ ఉంటే చెప్పమని అంగీకారం తెలిపాడని ఇన్ సైడ్ టాక్ ఉంది. కానీ పూర్తి లైన్ సిద్ధంగా లేకపోవడంతో కొంచెం టైం తీసుకుని అయినా సరే మంచి సబ్జెక్టుతో పెద్ది రిలీజ్ తర్వాత కలిసే ప్లాన్ లో ఉన్నట్టు వినికిడి. ఇదంతా పక్కనపెడితే ఒక మెలోడీ బీట్స్ ఉన్న పాటతో సోషల్ మీడియా మొత్తం డాన్స్ తో ఊగిపోయేలా మేజిక్ చేసిన బుచ్చిబాబు రెండో పాటతో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయమని అంతర్గత సమాచారం.

Related Post

Naveen Polishetty’s Anaganaga Oka Raju Promo Sets Social Media Ablaze!Naveen Polishetty’s Anaganaga Oka Raju Promo Sets Social Media Ablaze!

The ever-entertaining Naveen Polishetty is back to tickle funny bones with Anaganaga Oka Raju. The makers dropped a special Diwali Fun Blast Promo. The video radiates festival spirit, with Naveen’s

అంత పెద్ద మాట ఎందుకు పెద్దాయనాఅంత పెద్ద మాట ఎందుకు పెద్దాయనా

నటకిరీటి రాజేంద్రప్రసాద్ చాలా పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ సినిమాలో ఏముందో తాను చెప్పనని, ఒకవేళ చూశాక మీరు షాక్ అవ్వకపోతే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతానని వేలాది మంది సమక్షంలో