hyderabadupdates.com Gallery Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్ post thumbnail image

 
 
గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ నమ్మక ద్రోహం ప్రస్తుత టీటీడీ బోర్డుకు ఒక లోతైన పాఠంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను పునరుద్ధరించడానికి, లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి నిరంతరం కృషి చేయాలని చెప్పారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ మంగళవారం సాయంత్రం తన ఎక్స్‌ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘బోర్డు, అధికారులు, ఈఓ, జేఈఓ నుంచి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, విక్రేతల వరకు టీటీడీని నడుపుతున్న ప్రతి ఒక్కరికీ మీ పాత్ర కేవలం హోదా లేదా బిరుదు కాదు. లక్షలాది మంది సనాతనులకు దైవిక సేవ చేయడానికి ఒక పవిత్ర అవకాశం. ఆర్థిక నివేదికలు, నాణ్యత నియంత్రణ, ఆడిట్‌ల నుంచి విరాళాల నిర్వహణ వరకు అన్ని కార్యకలాపాలలో పూర్తి పారదర్శకతను పాటించాలి.
అన్ని వివరాలను బహిరంగంగా అందుబాటులో ఉంచాలని కోరుతున్నాను. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించడం భవిష్యత్తు కోసం ఒక ముందడుగు. ధర్మాన్ని రక్షించడం, దాని కోసం నిలబడటం ప్రతి ఒక్క సనాతనికి సమిష్టి బాధ్యత. దేశవ్యాప్తంగా ఉన్న మన దేవాలయాలన్నింటినీ సమాజం.. భక్తులే స్వయంగా నిర్వహించాలని నా ఆకాంక్ష’ అని అన్నారు.
 
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైంది – పవన్ కల్యాణ్
 
 
సనాతర ధర్మ పరిరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. సనాతర ధర్మ పరిరక్షణ కోసం ఓ ప్రత్యేక బోర్డు అవసరమని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు డిప్యూటీ సీఎం. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజానికి, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్థయాత్ర కేంద్రం కంటే ఎక్కువ అని అభివర్ణించారు. తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదని.. ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని ఉద్ఘాటించారు. తిరుపతి లడ్డూని అప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చారు. తిరుపతి లడ్డూని ఇలా అందజేయడం వల్ల హిందువుల సమష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఉద్ఘాటించారు. ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తారని నొక్కిచెప్పారు.
సనాతన భావాలు, ఆచారాలు ఎగతాళి చేస్తే తనకు ఎంతో ఆవేదన కలిగిందని పేర్కొన్నారు. లౌకికతత్వం రెండు వైపులా ఉండాలని సూచించారు. హిందువుల విశ్వాసంపై రక్షణ, గౌరవంపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సనాతన ధర్మం అత్యంత పురాతనమైనదని ఉద్ఘాటించారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికతలలో సనాతన ధర్మం ఒకటని అభివర్ణించారు. హిందువుల కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
The post Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pakistan: 14 మందిని సిక్కులను వెనక్కి పంపేసిన పాక్Pakistan: 14 మందిని సిక్కులను వెనక్కి పంపేసిన పాక్

    సిక్కుల గురువు గురునానక్ దేవ్ 556వ జయంతి సందర్భంగా అట్టారి-వాగా సరిహద్దు వద్ద 14 మందికి పైగా యాత్రికులకు ప్రవేశాన్ని పాకిస్థాన్ నిరాకరించింది. యాత్రికుల హిందూ మత విశ్వాసాలను కారణంగా చూపుతూ పాకిస్థాన్ ఇమిగ్రేషన్ అధికారులు వారిని వెనక్కి

జ‌గ‌న్ రెడ్డివ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలే : ప‌య్యావుల కేశ‌వ్జ‌గ‌న్ రెడ్డివ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలే : ప‌య్యావుల కేశ‌వ్

విజ‌య‌వాడ : టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలప లేదన్న వైఎస్సార్‌సీపీ వాదనలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్. ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర స్వామిపై

లాభాల బాట పట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ : చంద్ర‌బాబు నాయుడులాభాల బాట పట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ : చంద్ర‌బాబు నాయుడు

అమరావతి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విశాఖ ఉక్కు మళ్లీ లాభాల బాట పట్టింది. ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సచివాలయంలో విశాఖ ఉక్కు పురోగతిపై