hyderabadupdates.com Gallery Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌

Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌

Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌ post thumbnail image

 
 
పార్టీకి కార్యకర్తే అధినేత అని… ఆ దిశగా ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రాధాన్యం ఉండాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. అధికారం వచ్చిందనే నిర్లక్ష్యం వద్దని హితవు పలికారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో లోకేశ్‌ భేటీ అయ్యారు.
సార్వత్రిక ఎన్నికల ముందు ఉన్న కసి, చొరవ అధికారంలోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుని పనిచేయాలని ఆదేశించారు. ఇన్‌ఛార్జి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ఎన్నికలకు వ్యూహ రచన చేయలన్నారు. జనసేన, భాజపా ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం ఇన్‌ఛార్జిల సమన్వయం ఎంతో కీలకమని గుర్తుచేశారు. ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జిలను త్వరలోనే నియమిస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి వెళ్లి పార్టీ వ్యవహారాలపై సమీక్షించాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించేలా పర్యవేక్షించాలని లోకేశ్‌ తేల్చి చెప్పారు.
ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు మధ్య సమన్వయం పెంచే బాధ్యత జోనల్ కో-ఆర్డినేటర్లదేనని వెల్లడించారు. వారి పనితీరును ప్రతి నెలా సమీక్షిస్తానని తెలిపారు. జోనల్ కోఆర్డినేటర్లే పార్టీకి అన్నీ తామై వ్యవహరించాలన్నారు. వైకాపా పెట్టిన అక్రమ కేసులపై సమీక్షించి చట్టపరంగా పరిష్కరిద్దామని చెప్పారు. పెండింగ్‌లోని పార్టీ పదవులు త్వరితగతిన భర్తీ చేస్తామని ప్రకటించారు. జోనల్ కోఆర్డినేటర్లు.. మంతెన సత్యనారాయణ రాజు, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, దామచర్ల సత్య, సుజయ్ కృష్ణ రంగారావు, దీపక్ రెడ్డి, కోవెలమూడి రవీంద్ర, వేపాడ చిరంజీవి రావు, మందలపు రవి, పెళ్లకూరు శ్రీనివాస రెడ్డి తదితరులు సమావేశానికి హజరయ్యారు.
The post Nara Lokesh: ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించాలి – మంత్రి లోకేశ్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Kiran Mazumdar Shaw: వివాదం వేళ సీఎం, డిప్యూటీ సీఎంతో కిరణ్‌ మజుందార్‌ షా భేటీKiran Mazumdar Shaw: వివాదం వేళ సీఎం, డిప్యూటీ సీఎంతో కిరణ్‌ మజుందార్‌ షా భేటీ

    ఇటీవల బెంగళూరు నగర రహదారులు, చెత్తపై తీవ్ర విమర్శలు చేసిన బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా ప్రభుత్వ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. కిరణ్‌ మజుందార్‌ కు మద్దతుగా పారిశ్రామిక వేత్త హర్ష్‌ గొయెంకా.. సమస్యకు పరిష్కారం

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయంCM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

  తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లని ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్ కలెక్టర్ పదవి రద్దు చేసి.. కొత్త బాధ్యతలని అదనపు కలెక్టర్లకు అప్పగించింది.

Chirag Paswan: బిహార్‌ లో ఎన్డీయేకు తప్పని చిరాగ్ చికాకు ?Chirag Paswan: బిహార్‌ లో ఎన్డీయేకు తప్పని చిరాగ్ చికాకు ?

Chirag Paswan : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో ప్రస్తుతం అన్ని పార్టీలు సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి. అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి పక్షాలు తమ భాగస్వామ్య పార్టీలతో పొత్తులను తేల్చుకునే చర్చలను ముమ్మరం చేశాయి. ఎన్డీయే