hyderabadupdates.com movies రజినికాంత్ సినిమా వదులుకున్న దర్శకుడు

రజినికాంత్ సినిమా వదులుకున్న దర్శకుడు

సూపర్ స్టార్ రజినీకాంత్ ని డైరెక్ట్ చేయడం కంటే గొప్ప అవకాశం ఏముంటుంది. అందులోనూ కమల్ హాసన్ నిర్మాతగా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. కొద్దిరోజుల క్రితం సుందర్ సి దర్శకత్వంలో ఈ కాంబో నుంచి ఒక ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన అఫీషియల్ గా వచ్చింది. ఏదో యాడ్ తో సరిపెట్టలేదు. ఫోటోలు, ఆకర్షణీయమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కూడిన వీడియో ఇలా పెద్ద హంగామా చేశారు. సుందర్ సి మీద ఫ్యాన్స్ కు గొప్ప నమ్మకాలు లేవు కానీ ఒకప్పుడు తలైవర్ కు అరుణాచలం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కాబట్టి దాని విలువను దృష్టిలో పెట్టుకుని మరో రికార్డ్ బస్టర్ ఇస్తారని ఎదురు చూశారు.

కానీ ఇండస్ట్రీ సైతం నివ్వెరపోయేలా చేస్తూ సుందర్ సి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఆ మేరకు ఒక లెటర్ రూపంలో అధికారికంగా సోషల్ మీడియాలో చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు, మీడియా షాక్ తిన్నారు. లేఖ సుదీర్ఘంగా ఉన్నప్పటికీ అందులో ఎలాంటి కారణాలు పేర్కొనలేదు. అనివార్య పరిస్థితుల్లో ఇంత మంచి సినిమా నుంచి బయటకి రావాల్సి వచ్చిందని, అందరినీ క్షమించమని కోరుతూ రజని, కమల్ మార్గదర్శకత్వం తనకు ఎప్పుడూ ఉంటుందని అందులో పేర్కొన్నారు. కోలీవుడ్ లో ఎక్కడ చూసినా సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో ఇప్పుడీ టాపిక్కే డిస్కషన్ లో ఉంది.

చెన్నై టాక్ ప్రకారం ఏవో క్రియేటివ్ డిఫరెన్సులు వచ్చాయని చెబుతున్నారు కానీ ఎవరి మధ్య అనేది పేర్కొనడం లేదు. నిజానికి కథ ఇంకా పూర్తిగా రెడీ కాలేదట. అలాంటప్పుడు ఎందుకు హడావిడి చేశారనే ప్రశ్న తలెత్తుతుంది. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ రెండు సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. ఒకటి ఇప్పుడు సుందరి సి వదులుకుంది. రెండోది తన కాంబోలో మల్టీస్టారర్. దీనికి దర్శకుడిని ఇంకా లాక్ చేయలేదు. ఆదిలోనే హంసపాదు అన్నట్టు షూటింగ్ మొదలుపెట్టకుండానే ఇంత పెద్ద బాంబు రాజ్ కమల్ సంస్థ మీద పడింది. దీనికి రజినీకాంత్, కమల్ హాసన్ స్పందన ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

Related Post

Megastar Chiranjeevi Sends Heartfelt Birthday Wishes to CM Revanth ReddyMegastar Chiranjeevi Sends Heartfelt Birthday Wishes to CM Revanth Reddy

Megastar Chiranjeevi extended his warm greetings to Telangana Chief Minister A. Revanth Reddy on his birthday. Taking to social media, Chiranjeevi conveyed his heartfelt wishes to the CM, praying for