hyderabadupdates.com movies నెక్స్ట్ అధికారం మనదే… కేటీఆర్ తో ప్రభాస్ పెద్దమ్మ

నెక్స్ట్ అధికారం మనదే… కేటీఆర్ తో ప్రభాస్ పెద్దమ్మ

టాలీవుడ్ సీనియర్ నటుడు, దివంగత కృష్ణంరాజు ఇటు సినీ రంగంతో పాటు అటు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీగా రెండుసార్లు గెలిచి వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన కృష్ణంరాజు ఆ పార్టీలో చాలాకాలం యాక్టివ్ గా ఉన్నారు. ఆ తర్వాత తన భర్త అడుగుజాడల్లోనే నడిచిన బిజెపి తరఫున శ్యామల దేవి ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బిజెపి తరఫున బరిలోకి దిగిన శ్రీనివాస వర్మ తరఫున శ్యామలాదేవి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఆమె బీఆర్ఎస్ కు మద్దతుగా మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.

ఒక ఫంక్షన్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను శ్యామలా దేవి కలిశారు. ఆ చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ తలపై చేయి పెట్టి ఆశీర్వదించిన శ్యామలా దేవి… రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆశీర్వదించారు. నెక్స్ట్ అధికారం మనదే అంటూ ఆమె చేసిన కామెంట్లతో కేటీఆర్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఏది ఏమైనా… బిజెపికి మద్దతుగా నిలిచే శ్యామలా దేవి బీఆర్ఎస్ కు జై కొట్టడం ఇటు రాజకీయ, అటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

View this post on Instagram

Related Post

ప‌వ‌న్‌కు మేలి మలుపుగా.. 2025.. !ప‌వ‌న్‌కు మేలి మలుపుగా.. 2025.. !

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో 2025 మేలి మ‌లుపు సంవ‌త్స‌రంగా మారింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌ధానంగా 5 అంశాలు.. ప‌వ‌న్‌కు ఈ సంవ‌త్స‌రం క‌లిసి వ‌చ్చాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు.. ప‌వ‌న్‌ను ప్ర‌జ‌లు చూసిన కోణానికి