hyderabadupdates.com movies ఫ్లాపుల ప్రవాహానికి బ్రేక్ పడుతుందంటారా

ఫ్లాపుల ప్రవాహానికి బ్రేక్ పడుతుందంటారా

ఏడేళ్ల క్రితం మహానటి చూశాక కీర్తి సురేష్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు. అందులో నటనని మరో హీరోయిన్ ఎవరూ మ్యాచ్ చేయలేరన్నది వాస్తవం. అంత ఫేమ్ తెచ్చుకున్న కీర్తి ఆ తర్వాత మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో నటించినా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. నితిన్ లాంటి టయర్ 2 హీరోలతో నటించినా మిస్ ఇండియా అంటూ తను మాత్రమే ఉండే టైటిల్ రోల్స్ చేసినా అన్నీ దారుణంగా పోయాయి. ఇప్పుడు నెలాఖరు నవంబర్ 28 రివాల్వర్ రీటాగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇది చాలా ఆలస్యమై వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పటికి మోక్షం దక్కించుకుంది.

తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కథేంటో చెప్పేశారు. ఒక పెద్ద మాఫియా డాన్ (సునీల్) తండ్రి కనిపించకుండా పోతాడు. అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారని అందరూ భావిస్తుండగా రీటా (కీర్తి సురేష్) ఇంట్లో శవమై ఉంటాడు. ఈ విషయం బయటికి పొక్కకుండా కుటుంబం మొత్తం చాలా జాగ్రత్త పడుతుంది. తల్లి (రాధికా) సహాయంతో శవం మాయం చేయాలని ప్లాన్ చేసుకుంటుంది రీటా. ఇంకోపక్క నాన్న ఏమయ్యాడో తెలియక సదరు డాన్ పిచ్చిపట్టిన వాడిలా అనుమానం వచ్చిన వాడినల్లా చంపుకుంటూ పోతాడు. చివరికి ఏమయ్యిందనేది తెరమీద చూడమంటున్నారు దర్శకుడు జెకె చంద్రు.

టేకింగ్ గట్రా చూస్తుంటే మరీ కొత్తగా ఏం లేదు. నయనతార కోకో కోకిలతో మొదలుపెట్టి తరుణ్ భాస్కర్ కీడా కోలా దాకా ఇలాంటి డార్క్ కామెడీ సినిమాలు చూసిన జనాలకు రివాల్వర్ రీటా అంత కొత్తగా ఏం చూపిస్తుందో చూడాలి. అసలే రామ్ ఆంధ్రకింగ్ తాలూకాతో పోటీ ఉంది. వారం తిరగడం ఆలస్యం బాలయ్య అఖండ 2తో వచ్చేస్తాడు. ఇంత పోటీ పెట్టుకుని రివాల్వర్ రీటా ఓ రేంజ్ లో ఉంటే తప్ప మెప్పించడం కష్టం. ఏడు సంవత్సరాల కాలంలో దసరా, సర్కార్ తప్ప చెప్పుకోదగ్గ హిట్టు లేని కీర్తి సురేష్ పదిహేనుకి పైగా ఫ్లాపులు చూసిందంటే ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ అదే నిజం. మరి రీటా బ్రేక్ ఇస్తుందో లేదో.

Related Post

పవన్‌తో వారం షూటింగ్ చేసి బయటికిపవన్‌తో వారం షూటింగ్ చేసి బయటికి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎంతో ఎగ్జైట్ అవుతుంది. స్టార్ హీరోయిన్లు అయినా ఆ అవకాశాన్ని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఇక అప్‌కమింగ్ హీరోయిన్లయితే ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. కానీ అఖిల్ మూవీ

క్లైమాక్స్ మార్చి మంచి పని చేశారుక్లైమాక్స్ మార్చి మంచి పని చేశారు

త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమాగా ‘అరవింద సమేత’ను చెప్పొచ్చు. ఎక్కువగా సరదాగా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తీసే త్రివిక్రమ్.. చాలా సీరియస్‌ కథతో ఈ సినిమా చేశాడు. ఆ సినిమాలో కనిపించే ఇంటెన్సిటీ.. త్రివిక్రమ్ మరే చిత్రంలోనూ చూడలేం.

జగన్ మెప్పు కోసం భజనలు చేయకండిజగన్ మెప్పు కోసం భజనలు చేయకండి

రాజకీయాల్లో పొగడ్తలంటే ఎవరికి ఇష్టముండవు? తమ గురించి అనుచరులు, అనుయాయులు భజన చేస్తుంటే చాలామంది నేతాశ్రీలకు వినసొంపుగా ఉంటుంది. నేతల మెప్పు పొందేందుకు భజన చేసే అనుచరులకు అడ్డూ అదుపే లేదు. ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరుల్లో కొంతమంది కూడా