hyderabadupdates.com movies అంచనాలకు తగ్గట్టే అఖండ 2 తాండవం

అంచనాలకు తగ్గట్టే అఖండ 2 తాండవం

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సిరీస్ కొనసాగిస్తూ బాలకృష్ణ – బోయపాటి శీను కలయికలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం నుంచి మొదటి ఆడియో సింగిల్ వచ్చేసింది. సినిమా విడుదల ఇంకో ఇరవై రోజుల్లో ఉండగా ఇప్పటిదాకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఊరట కలిగిస్తూ తమన్ ఫస్ట్ సాంగ్ ఇచ్చాడు. శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ అరుదైన సింగింగ్ కాంబోలో కల్యాణ చక్రవర్తి సాహిత్యం సమకూర్చగా, గుడి గోపురాల మధ్య బాలయ్య తాండవం చేస్తుండగా చూపించిన విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎక్కువగా మేకింగ్ దృశ్యాలను పొందుపరిచారు.

పాట ప్రారంభం అఖండ 1 తరహాలో మొదలుపెట్టినప్పటికీ క్రమంగా తమన్ తనదైన ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయాడు. తెలుగు,సంస్కృతం కలగలిపి కూర్చిన పదాలు అర్ధవంతంగా ఉన్నాయి. ముంబైలో జరిగిన ఈవెంట్ లో ఈ సాంగ్ లాంచ్ జరిగిపోయింది. అయితే ఇప్పుడు ట్రెండింగ్ వాతావరణం చూస్తుంటే ఇలాంటి పాట వైరల్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. పెద్ది చికిరి చికిరి లాగా ఫాస్ట్ బీట్ కాకపోవడంతో ఇలాంటి భక్తి పాటలు అసలు సినిమా రిలీజయ్యాక మరింత ఆదరణ పొందుతాయి. అఖండ 2 ప్రధాన ఉద్దేశం ఏంటో చెప్పేందుకే ప్రత్యేకించి ఈ గీతాన్ని విడుదల చేశారనుకోవచ్చు.

డిసెంబర్ 5 విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని మరోసారి ఈ వీడియోలో స్పష్టం చేశారు. సో వచ్చే నెల తొలి వారంలో బాలయ్య ఊచకోత చూడొచ్చు. టైం దగ్గర పడుతుండటంతో టీమ్ పబ్లిసిటీని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అక్కడి ఆడియన్స్ కాంతార, కార్తికేయ 2 లాంటి డివోషనల్ మూవీస్ కి ఇచ్చిన ఆదరణ చూసి అఖండ 2కి అంతకు మించిన స్పందన దక్కుతుందనే నమ్మకంతో దర్శక నిర్మాతలున్నారు. ఏపీ తెలంగాణలో త్వరలో భారీ ఈవెంట్స్ చేయబోతున్నారు. వాటికి సంబంధించిన వివరాలు ఇంకో వారం రోజుల్లో వెల్లడి కాబోతున్నాయి.

Related Post

OTT: Latest crime thriller on ZEE5 clocks a massive 250 million streaming minutesOTT: Latest crime thriller on ZEE5 clocks a massive 250 million streaming minutes

Bhagwat: Chapter One – Raakshas is a recent Hindi-language crime thriller directed by Akshay Shere. Headlined by prominent actor Arshad Warsi, the movie follows the investigation of a prostitution racket.