hyderabadupdates.com Gallery Trishul: గుజరాత్‌ తీరంలో త్రివిధ దళాల ‘త్రిశూల్‌’ విన్యాసాలు

Trishul: గుజరాత్‌ తీరంలో త్రివిధ దళాల ‘త్రిశూల్‌’ విన్యాసాలు

Trishul: గుజరాత్‌ తీరంలో త్రివిధ దళాల ‘త్రిశూల్‌’ విన్యాసాలు post thumbnail image

 
 
భారత త్రివిధ దళాలు సంయుక్తంగా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాయి. ఎక్సర్‌సైజ్‌ త్రిశూల్‌ పేరిట భారత సైన్యం, నావికా దళం, వైమానిక దళం గురువారం గుజరాత్‌ లోని సౌరాష్ట్ర సముద్ర తీరంలో కలిసికట్టుగా విన్యాసాలు నిర్వహించాయి. దాదాపు గంటపాటు ఈ కార్యక్రమం కొనసాగింది. భూమిపై, ఆకాశంలో, సముద్రంలో త్రివిధ దళాల జవాన్ల సాహస కృత్యాలు అబ్బురపర్చాయి. భారత మిలటరీ శక్తిని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా త్రిశూల్‌ కొనసాగింది.
‘అంఫెక్స్‌–2025’అనే కోడ్‌ పేరుతో జరిగిన విన్యాసాల్లో టీ–72 యుద్ధ ట్యాంకులు, అసాల్డ్‌ దళాలు, జాగ్వార్‌ ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్, ఎస్‌–30 ఎంకేఐ యుద్ధ విమానాలతోపాటు మరికొన్ని నావికా దళం యుద్ధనౌకలు పాల్గొన్నాయి. నావికా దళం ఆధ్వర్యంలో గత రెండు వారాలుగా త్రివిధ దళాల విన్యాసాలు కొనసాగుతున్నాయి. అవి గురువారం ముగిశాయి. థార్‌ ఎడారి నుంచి కచ్‌ ప్రాంతం దాకా వేర్వేరు ప్రదేశాల్లో ఈ కార్యక్రమం జరిగింది.
 
ఉమ్మడి శక్తి, సమన్వయం
గుజరాత్‌ పోర్బందర్‌ సమీపంలోని మాధవ్‌పూర్‌ బీచ్‌లో జరిగిన విన్యాసాలకు త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మూడు దళాల ఉమ్మడి శక్తికి, సమన్వయానికి త్రిశూల్‌ ఒక బెంచ్‌మార్క్‌ అని వారు చెప్పారు. నూతన ఆయుధాలు, సైనిక పరికరాలను పరీక్షించినట్లు తెలిపారు. మన సైన్యం బలం పెరిగిందని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంచేశారు. 30 వేల మంది సైనికులు, యుద్ధ విమానాలు, దాదాపు 25 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఈ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొన్నట్లు వెల్లడించారు. యుద్ధక్షేత్రంలోని పరిస్థితులను సృష్టించి, విన్యాసాలు చేపట్టినట్లు తెలియజేశారు.
The post Trishul: గుజరాత్‌ తీరంలో త్రివిధ దళాల ‘త్రిశూల్‌’ విన్యాసాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

25న బ్రేక్ ద‌ర్శ‌నాలు బంద్ : టీటీడీ చైర్మ‌న్25న బ్రేక్ ద‌ర్శ‌నాలు బంద్ : టీటీడీ చైర్మ‌న్

తిరుమ‌ల : శ్రీ‌వారి ఆల‌యంలో ఈనెల 25న ర‌థ స‌ప్త‌మి నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందుకు గాను శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవ‌లు,

అమెరికా బెదిరింపుల‌కు భ‌యప‌డం : ఇరాన్అమెరికా బెదిరింపుల‌కు భ‌యప‌డం : ఇరాన్

ఇరాన్ : మ‌రో యుద్దానికి తెర తీయ‌నున్నాడా అమెరికా బాస్ ట్రంప్. ఆయ‌న గ‌త కొంత కాలంగా ప‌లు దేశాలపై పెత్త‌నం చెలాయించేందుకు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య‌న ఇండియాను బెదిరించారు. ర‌ష్యాతో సంబంధం తెంచు కోవాల‌ని ఒత్తిడి చేశాడు.

ఆంధ్రప్రదేశ్‌ను ప‌ర్యాట‌క‌ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతాంఆంధ్రప్రదేశ్‌ను ప‌ర్యాట‌క‌ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతాం

అమరావతి : ఏపీని ప‌ర్యాట‌క హ‌బ్ గా మార్చేస్తామ‌న్నారు రాష్ట్ర ప‌ర్యాట‌క , సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్ర‌బాబు దిశా నిర్దేశంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రవేశ పెట్టిన