hyderabadupdates.com movies అఖండ‌-2 ఇంట‌ర్వెల్‌కే 500 రూపాయ‌లు

అఖండ‌-2 ఇంట‌ర్వెల్‌కే 500 రూపాయ‌లు

ఈ ఏడాది మిగిలిన నెల‌న్న‌ర రోజుల్లో టాలీవుడ్ నుంచి అత్య‌ధిక అంచ‌నాల‌తో రాబోతున్న సినిమా.. అఖండ‌-2. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌గ‌ల‌ద‌నే అంచ‌నాలున్నాయి. టీం కూడా ఆ దిశ‌గానే అఖండ‌-2ను ప్రమోట్ చేస్తోంది. ముంబ‌యి వేదిక‌గా ఒక పెద్ద ఈవెంట్ నిర్వ‌హించి ఈ మూవీ నుంచి తాండ‌వం పాట‌ను లాంచ్ చేసింది చిత్ర బృందం. దీంతో పాటుగా ఒక స్పెష‌ల్ డైలాగ్ ప్రోమోను కూడా ఎక్స్‌క్లూజివ్‌గా హిందీ ప్రేక్ష‌కుల‌కు అందించారు. 

ఈ పాట‌కు, ఆ డైలాగ్‌కు మంచి రెస్పాన్సే వ‌చ్చింది. ఇదిలా ఉంటే సాంగ్ లాంచ్ ఈవెంట్లో ప్ర‌సంగాలు కూడా ఆస‌క్తిక‌రంగా సాగాయి. బాల‌య్య హిందీలోనే నాన్ స్టాప్ స్పీచ్ ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ.. అఖండ‌-2 సినిమా కాదు, భార‌త దేశ‌పు ఆత్మ అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక ఈ ఈవెంట్లో త‌మ‌న్ స్పీచ్ అన్నిటికంటే హైలైట్‌గా నిలిచింది.

అఖండ‌-2 ఇంట‌ర్వెల్ గురించి ఒక రేంజిలో ఎలివేష‌న్ ఇచ్చాడు త‌మ‌న్. ఈ సినిమా కోసం పెట్టే 500 రూపాయ‌ల‌కు ఆ ఒక్క ఇంట‌ర్వెలే గిట్టుబాటు చేస్తుంద‌ని అత‌న‌న్నాడు. బోయ‌పాటి శ్రీను ఆ ఎపిసోడ్‌ను అంత గొప్ప‌గా తీసిన‌ట్లు త‌మ‌న్ చెప్పాడు. ఇంటర్వెల్ చూసి ఇక చాల‌నుకుని థియేట‌ర్ల నుంచి బ‌య‌టికి వ‌చ్చేయొచ్చ‌ని త‌మ‌న్ చెప్పాడు. బోయ‌పాటి ఎంతో గొప్ప‌గా సినిమా తీస్తే.. బాల‌య్య అంత గొప్ప‌గా న‌టించాడ‌ని.. అందుకు త‌గ్గ‌ట్లే తాను కూడా సంగీతం అందించాన‌ని త‌మ‌న్ చెప్పాడు. 

అఖండ‌-2 ఫ‌స్టాఫ్ వ‌ర్క్ పూర్తి చేసేస‌రికే త‌న ద‌గ్గ‌ర ఉన్న సంగీతం అంతా అయిపోయింద‌ని.. ఆ త‌ర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ వ‌న‌రులు స‌మ‌కూర్చుకోవాల్సి వ‌చ్చింద‌ని అత‌ను చెప్పాడు. అఖండ సినిమా అయ్యాక పార్ట్-2 తీయ‌డానికి ఏం క‌థ ఉంద‌ని చాలామంది అనుకున్నార‌ని.. కానీ ఐదు భాగాలు తీయ‌గ‌ల కంటెంట్ ఈ క‌థ‌లో ఉంద‌ని.. అన్ని సినిమాల‌కూ బాల‌య్య రెడీగా ఉంటార‌ని.. శివుడి గురించి ఎంతైనా చెప్పొచ్చ‌ని త‌మ‌న్ వ్యాఖ్యానించాడు. అఖండ‌-2 డిసెంబ‌రు 5న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.

Related Post

నాగ్ ఫ్యామిలీ మెంబర్ డిజిటల్ అరెస్ట్నాగ్ ఫ్యామిలీ మెంబర్ డిజిటల్ అరెస్ట్

పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మను నడిపిస్తున్న ఇమ్మడి రవి అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పైరసీని అరికట్టడంలో ఇది పెద్ద బ్రేక్ త్రూగా ఇండస్ట్రీ జనాలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, దర్శక

పిక్‌టాక్‌: `త్రిమూర్తులు`… పొరుగింటి వ్య‌క్తులు ప‌క్క‌ప‌క్క‌న కూర్చున్న‌ట్టు!!పిక్‌టాక్‌: `త్రిమూర్తులు`… పొరుగింటి వ్య‌క్తులు ప‌క్క‌ప‌క్క‌న కూర్చున్న‌ట్టు!!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఏపీ సీఎం చంద్ర‌బాబు.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. ఒకే వేదిక‌పై ప‌లు మార్లు క‌లుసుకున్నారు. కూర్చున్నారు కూడా. కానీ.. వారంతా ప‌క్క‌ప‌క్క‌న కూర్చున్నారు. వారి మ‌ధ్య‌లో ఇత‌ర నాయ‌కులు కూడా కూర్చున్నారు. కానీ.. తాజాగా

Thalaivar173: Shoot timelines & genre details of Rajinikanth’s next revealedThalaivar173: Shoot timelines & genre details of Rajinikanth’s next revealed

Superstar Rajinikanth is currently busy shooting for Jailer 2, the sequel to the 2023 blockbuster Jailer, directed by Nelson Dilipkumar. After wrapping up Jailer 2, Rajini will move on to