hyderabadupdates.com movies ఈరోజు కృష్ణ గారు బ్రతికి ఉండుంటే…

ఈరోజు కృష్ణ గారు బ్రతికి ఉండుంటే…

సూపర్ స్టార్ కృష్ణ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అని కెరీర్ ఆరంభంలోనే పేరు సంపాదించాడు మహేష్ బాబు. కొన్నేళ్లకు తండ్రికి మించిన తనయుడు అని కూడా అనిపించుకున్నాడు. తండ్రికి ఉన్న సూపర్ స్టార్ బిరుదును అభిమానులు కొడుక్కీ ఇచ్చేశారు. ఇప్పుడు మహేష్ బాబు గ్లోబల్ స్థాయికి వెళ్లబోతున్నాడు. 

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కలల కాంబినేషన్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. దర్శక ధీరుడు రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్న సినిమా కొన్ని నెలల కిందటే పట్టాలెక్కింది. ఈ రోజు ఆ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లాంచ్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ఎంతో ఎమోషనల్ అయిన మహేష్ బాబు.. ఎక్స్ వేదికగా తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు.

తండ్రితో కలిసి నటించిన ఒక సినిమా చిత్రీకరణ సందర్భంగా కలిసి ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటోను మహేష్ పంచుకున్నాడు. ‘‘ఈ రోజు నిన్ను ఇంకొంచెం ఎక్కువగా తలుచుకుంటున్నా. నువ్వు ఉండి ఉంటే ఎంతో గర్వించేవాడివి నాన్న’’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ కూడా జోడించాడు మహేష్ బాబు. పిల్లలు తమను మించి ఎదిగినపుడు.. వారి ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతున్నపుడు తల్లిదండ్రులకు అంతకుమించిన ఆనందం ఉండదు. 

కెరీర్లో మహేష్ ఒక్కడు, దూకుడు లాంటి భారీ విజయాలు అందుకుని గొప్ప స్థాయికి చేరుకున్నపుడు కృష్ణ ఎంత ఆనందించారో అందరికీ తెలిసిందే. ఐతే రాజమౌళితో సినిమా ద్వారా ఇప్పుడు మహేష్ మరెన్నో మెట్లు ఎక్కేయబోతున్నాడు. ఈ సమయంలో కృష్ణ ఉంటే ఆయన ఆనందానికి అవధులు ఉండేవి కావు. ఆ విషయమే తలుచుకుని మహేష్ ఎమోషనల్ అయినట్లున్నాడు. ఇది కృష్ణ, మహేష్ అభిమానులందరినీ కూడా ఉద్వేగానికి గురి చేస్తోంది.

Related Post

మీ పెట్టుబడికి మా హామీ: చంద్రబాబు భరోసామీ పెట్టుబడికి మా హామీ: చంద్రబాబు భరోసా

ఏపీకి పెట్టుబడుల వేట కొనసాగిస్తున్న సీఎం చంద్రబాబు అలుపెరగని పోరాటమే చేస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఆయన పెట్టుబడుల కోసం గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. బుధవారం దుబాయ్‌కు వెళ్లిన ఆయన, అక్కడ నుంచి గురువారం ఉదయం అబుదాబీకి చేరుకున్నారు.క్కడి పారిశ్రామిక వేత్తలను కలుసుకుని

టీడీపీ మేయ‌ర్ క‌పుల్ మ‌ర్డ‌ర్‌: ఐదుగురికి ఉరి శిక్ష‌టీడీపీ మేయ‌ర్ క‌పుల్ మ‌ర్డ‌ర్‌: ఐదుగురికి ఉరి శిక్ష‌

ఏపీలో జ‌రిగిన మేయ‌ర్ దంప‌తుల దారుణ హ‌త్య కేసులో స్థానిక కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. దోషులుగా తేలిన ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. అదేవిధంగా ఈ కేసులో ఏ1గా ఉన్న దోషికి ఏకంగా 70 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధించిన