hyderabadupdates.com movies ‘కాంత’ రివ్యూల తేడాపై రానా

‘కాంత’ రివ్యూల తేడాపై రానా

ఈ వారం తెలుగులో చాలా సినిమాలే రిలీజయ్యాయి కానీ.. వాటిలో ‘కాంత’ అన్నింట్లోకి చాలా ప్రత్యేకంగా కనిపించింది. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి ఇందులో ముఖ్య పాత్రల్లో నటిస్తూ స్వయంగా నిర్మించడం విశేషం. 1950 నాటి సినిమా మేకింగ్ చుట్టూ తిరిగే కథతో ఎంతో ఖర్చు పెట్టి, శ్రమకు ఓర్చి ఈ చిత్రాన్ని రూపొందించింది చిత్ర బృందం. ఇలాంటి సినిమా తీయడంలో టీం ఒక అభిరుచిని చాటింది. 

కొత్త దర్శకుడైన సెల్వమణి సెల్వరాజ్ సేఫ్ గేమ్ ఆడకుండా రిస్కీ సబ్జెక్ట్ తీసుకుని ఎంతో తపనతో సినిమా తీశాడు. ఇందులో గ్రేట్ పెర్ఫామెన్సులు ఉన్నాయి. అలాగే సాంకేతిక హంగులు గొప్పగా కుదిరాయి. కానీ ఎన్ని ఉన్నా.. రెండున్నర గంటలు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టి వారిని ఎంటర్టైన్ చేయడంలోనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. కానీ ‘కాంత’ ఈ విషయంలో సంతృప్తిపరచలేకపోయింది. మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ.. దీన్ని జనరంజకమైన చిత్రంగా చెప్పలేని పరిస్థితి.

‘కాంత’ సినిమా చూసిన తెలుగు సమీక్షకులు, ప్రేక్షకులు.. కంటెంట్‌కు తగ్గట్లే నిక్కచ్చిగా స్పందించారు. సినిమా యావరేజ్ అనే అన్నారు. కానీ చిత్రమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు రెండు రోజుల ముందు తమిళ ప్రిమియర్స్ నుంచి గొప్ప టాక్ వచ్చింది. ఈ ఏడాది బెస్ట్ మూవీ అని.. క్లాసిక్ అని.. ‘కాంత’ను తెగ పొగిడేశారు. అంతగా ఏముందా అని చూస్తే.. ‘కాంత’ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో తమిళ క్రిటిక్స్ ఇచ్చినవి పెయిడ్ రివ్యూలా.. లేక వాళ్లకు సినిమాను అర్థం చేసుకోవడం రాలేదా.. లేదంటే తమిళ సినిమాల క్వాలిటీ పడిపోవడం వల్ల ఇది వాళ్లకు గొప్పగా అనిపించిందా అనే చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో. 

‘కాంత’ సక్సెస్ ప్రెస్ మీట్‌లో రానా దగ్గుబాటికి ఇదే విషయమై ప్రశ్న ఎదురైంది. అందుకతను స్పందిస్తూ.. తమిళ క్రిటిక్స్, ప్రేక్షకులు సినిమా మీద తక్కువ అంచనాలు పెట్టుకున్నారని, అలా చూడ్డం వల్లే వాళ్లకు సినిమా గొప్పగా అనిపించిందని అన్నాడు. తెలుగు సమీక్షకులు, ప్రేక్షకులు అంచనాలు ఎక్కువ పెట్టుకోవడం వల్ల వాళ్లకు ఇది కొంచెం తక్కువగా అనిపించి ఉండొచ్చని.. రివ్యూల్లో ఇంత తేడా ఉండడం తనను ఆశ్చర్యపరిచిందని.. కానీ అంతిమంగా ‘కాంత’ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంటుందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు.

Related Post

నితిన్… ఇదీ వదిలేశాడా?నితిన్… ఇదీ వదిలేశాడా?

ఒకప్పుడు వరుసగా డజనుకు పైగా ఫ్లాపులు ఎదుర్కొని ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయే పరిస్థితుల్లో ‘ఇష్క్’ మూవీతో ఊపిరి పీల్చుకున్నాడు నితిన్.  ఆ తర్వాత అతను జాగ్రత్తగానే అడుగులు వేశాడు. గుండె జారి గల్లంతయ్యిందే, అఆ, భీష్మ లాంటి విజయాలతో తన కెరీర్ బాగానే