hyderabadupdates.com movies ఆ దేశ మాజీ ప్రధానికి ఉరిశిక్ష ఖరారు

ఆ దేశ మాజీ ప్రధానికి ఉరిశిక్ష ఖరారు

బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఐసీటీ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఢాకా అల్లర్ల కేసులో హసీనాకు ఈ శిక్ష విధించారు. ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం తీసుకుంటోంది. షేక్‌ హసీనా తీరు మానవత్వానికి మచ్చ అని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయబడింది. హసీనాను దోషిగా ఢాకా ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రిబ్యునల్‌ తేల్చింది.

హసీనా నేరం చేసిందని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. హసీనా మానవత్వాన్ని మరిచింది, ఆమె చేతులు రక్తంతో తడిచాయి.. ఆందోళనకారుల్ని చంపమని హసీనా ఆదేశాలు జారీ చేశారు అని కోర్టు పేర్కొంది.

2024 లో బంగ్లాదేశ్ ఘర్షణల నేపథ్యంలో అప్పటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆ అల్లర్లలో 300 మందికి మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు ప్రధాని షేక్ హసీనా ఇంటిని ముట్టడించడంతో ఆమె రాజీనామా చేసి భారత్ కి జారుకున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని షేక్‌ హసీనా పేర్కొన్నారు. తీర్పు వెల్లడించడానికి ముందు ఆమె సోమవారం పార్టీ మద్దతుదారులకు ఆడియో సందేశాన్ని పంపారు.

తన మద్దతుదారులు ఆందోళన చెందవద్దని అన్నారు. తాను బ్రతికే ఉంటానని, మళ్లీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని, బంగ్లాదేశ్‌ కి న్యాయం చేస్తానని అన్నారు. తీర్పు వెలువడిన నేపథ్యంలో బంగ్లాదేశ్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఢాకాలో యూనస్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా భారీగా భధ్రతా దళాలను మోహరించింది.

Related Post

కిరణ్ నమ్మకం నిజమయ్యిందాకిరణ్ నమ్మకం నిజమయ్యిందా

దీపావళి సినిమాల్లో ప్రమోషన్స్ పరంగా కొంచెం కాంట్రావర్సీ పరంగా ముందున్నది కె ర్యాంపే. అయితే టీమ్ మాత్రం ఎక్కడ నమ్మకం తగ్గకుండా ఒకే కాన్ఫిడెన్స్ ని ప్రదర్శిస్తూ వచ్చింది. ఇవాళ ఓపెనింగ్స్ చూస్తే మరీ క, ఎస్ఆర్ కల్యాణమండపం రేంజ్ లో