hyderabadupdates.com movies పైరసీ కథ క్లైమాక్సు చేరినట్టేనా

పైరసీ కథ క్లైమాక్సు చేరినట్టేనా

టాలీవుడ్ ఈ రోజు సంతోషంలో మునిగి తేలుతోంది. పైరసీ వ్యాప్తికి విపరీతంగా దోహద పడిన ఐబొమ్మ నిర్వాహకుడు పట్టుబడటంతో పాటు అతని యాప్స్ ని మూసేయించడం దానికి కారణం. పోలీస్ కమీషనర్ సజ్జనార్ తో కలిసి సినీ ప్రముఖులు ప్రెస్ మీట్ లో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఒక పెద్ద గండం తప్పినట్టే. ఇరవై వేల సినిమాలను హార్ట్ డిస్క్ లో దాచుకుని, ఇరవై కోట్ల రూపాయలు ఒక్క పైరసీ నుంచే సంపాదించిన ఇమ్మడి రవి తెలివితేటలు చూసి కాసేపు పోలీసులకు కూడా నోటమాట ఆగి ఉండొచ్చు. కాకపోతే దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ పదే పదే ఛాలెంజ్ చేయడం చివరికి జైలు పాలు చేసింది.

సరే శుభం జరిగింది, అందరూ కోరుకున్నది ఇదే. మరి పైరసీ కథ క్లైమాక్స్ కు చేరి అంతమైనట్టేనా అంటే వెంటనే సమాధానం చెప్పలేం. ఎందుకంటే వరల్డ్ వైడ్ పాతుకుపోయిన పైరసీ మొత్తం సదరు ఇమ్మడి రవి వల్లే జరగలేదు. అతనో ప్రధాన పాత్రధారి అంతే. ఇంకా మిగిలిన క్యాస్టింగ్ బోలెడున్నారు. వాళ్ళను కూడా పట్టుకోవాలి. ముఖ్యంగా రిలీజ్ రోజే ప్రింట్లు పెట్టేస్తున్న తమిళ్ ఎంవి లాంటివి కట్టడి కావాలి. ఇది కూడా పెద్ద నెట్ వర్క్. టొరెంట్స్ పేరుతో వీళ్ళు పైరసీని పంచే విధానం చాలా సంవత్సరాల నుంచి ఉంది. కొన్నేళ్ల క్రితం అరుణ్ విజయ్ హీరోగా తమిళ్ రాకర్స్ అనే వెబ్ సిరీస్ కూడా వచ్చింది.

హైదరాబాద్ పోలీసులకు నెక్స్ట్ టార్గెట్ వీళ్ళే కావాలి. ఇందులో కూడా విజయం సాధిస్తే సినిమా రంగానికి ఇంకా పెద్ద మేలు జరుగుతుంది. పైరసీ దొరకదని తెలిసినప్పుడు ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు. వంద శాతం కాకపోయినా కనీసం అందులో సగం మంది టికెట్లు కొన్నా బాక్సాఫీస్ కు వందల కోట్ల ప్రయోజనం కలుగుతుంది.. సజ్జనార్ మాటలను బట్టి చూస్తే ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేలా లేరు. కెమెరా ప్రింట్ల నుంచి హెచ్డి వర్షన్ల దాకా ఎదిగిపోయిన ఈ పైరసీ మురికికి మూల కారణంగా నిలిచిన సర్వర్లను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముందు చేయాల్సింది ఇదే.

Related Post

ప్రెస్ క్ల‌బ్ పోరు: ⁠ మ‌న జ‌ర్న‌లిస్ట్ ⁠ ర‌మేష్‌ను గెలిపించుకుందాం!ప్రెస్ క్ల‌బ్ పోరు: ⁠ మ‌న జ‌ర్న‌లిస్ట్ ⁠ ర‌మేష్‌ను గెలిపించుకుందాం!

క‌లం హాలికులుగా స‌మాజ చైత‌న్యానికి నిరంత‌రం చెమ‌టోడుస్తున్న జ‌ర్న‌లిస్టుల‌కు ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా.. నేనున్నానంటూ ముందుకు వ‌చ్చే వారే ఆప‌న్నులు. నేనున్నానంటూ.. అండ‌గా నిలిచేవారే.. పాత్రికేయుల‌కు ఆప‌త్బాంధ‌వులు. అలాంటి వారిలో మిన్న‌గా.. ముందుండే.. జ‌ర్న‌లిస్టు.. వ‌రికుప్ప‌ల ర‌మేష్‌(ఈనాడు). సుదీర్ఘ కాలంగా