hyderabadupdates.com Gallery Bomb Threat: తమిళనాడులో సీఎం సహా ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపు

Bomb Threat: తమిళనాడులో సీఎం సహా ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపు

Bomb Threat: తమిళనాడులో సీఎం సహా ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపు post thumbnail image

 
 
తమిళనాడులో సీఎం స్టాలిన్‌ సహా పలువురు ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్‌, పోలీసులు తనిఖీలు చేశారు. అనంతరం, అది ఫేక్‌ బెదిరింపు మొయిల్‌ అని పోలీసులు నిర్ధారించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
 
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బు నివాసానికి ఆదివారం రాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కార్యాలయానికి బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం నివాసం సహా నాలుగు ప్రదేశాలలో భద్రతా తనిఖీలు చేపట్టారు. ఇళ్లు, పరిసర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ​కొన్ని గంటల పాటు సోదాలు జరిగాయి. తనిఖీ సమయంలో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అది ఫేక్‌ మొయిల్‌ అని నిర్దారించారు. కాగా, బెదిరింపు పంపిన వ్యక్తి గురించి ఎలాంటి వివరాలను అధికారులు వెల్లడించలేదు.
మరోవైపు.. ఇటీవలి కాలంలో తమిళనాడు ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం పోలీసులకు తలనొప్పిగా మారింది. కొందరు ఆకతాయిలు ఇలా ఫేక్‌ కాల్స్‌, ఫేక్‌ మొయిల్స్‌ పెట్టి బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత వారం కూడా చెన్నైలోని ఇంజంబక్కంలోని అజిత్ కుమార్ నివాసానికి గుర్తు తెలియని వ్యక్తి నుండి బాంబు బెదిరింపు వచ్చింది. అంతకుముందు.. నటుడు అరుణ్ విజయ్‌, ఇళయరాజా స్టూడియోకు సైతం ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చాయి.
The post Bomb Threat: తమిళనాడులో సీఎం సహా ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

యువ‌త‌కు నైపుణ్యం, సాధికార‌త‌పై ఏపీ ఫోక‌స్యువ‌త‌కు నైపుణ్యం, సాధికార‌త‌పై ఏపీ ఫోక‌స్

దావోస్ : ఏపీ ప్ర‌భుత్వం మారుతున్న టెక్నాల‌జీని పూర్తిగా వినియోగించుకునేందుకు కృషి చేస్తోంద‌ని చెప్పారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. దావోస్ లో జ‌రుగుతున్న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ తీసుకుంటున్న

రూ. 37.12 కోట్ల విలువైన భూముల‌ను కాపాడిన హైడ్రారూ. 37.12 కోట్ల విలువైన భూముల‌ను కాపాడిన హైడ్రా

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రాణ‌వాయువును అందించే పార్కుల క‌బ్జాల‌ను హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తోంది. ఫిర్యాదు అందిన వెంట‌నే రంగంలోకి దిగి వాటిని ర‌క్షిస్తోంది. ఇలా ఒకే రోజు ఒకే

Minister Nara Lokesh : పిల్లలకు నైతిక విలువలు చాలా అవసరం – మంత్రి లోకేష్Minister Nara Lokesh : పిల్లలకు నైతిక విలువలు చాలా అవసరం – మంత్రి లోకేష్

Nara Lokesh : నైతిక విలువలు, సమాజంలో మార్పుకు సంబంధించి సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విలువలు, విద్యా సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం,