పైరసీ వల్ల సినిమా పరిశ్రమకు చాలా నష్టం జరిగిందని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ పైరసీ మాస్టర్ మైండ్, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కొత్త టెక్నాలజీ ఉపయోగించి రవి సినిమాలు అప్‌లోడ్ చేసేవాడు. పైరసీలో సినిమాలు చూసే వాళ్లపై నిఘా పెట్టినట్టు సజ్జనార్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రవి రూ.20 కోట్లు సంపాదించాడని సజ్జనార్ వెల్లడించారు.
హైదరాబాద్ సీపీ సజ్జనార్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఐబొమ్మపై చాలా రోజులుగా దర్యాప్తు చేస్తున్నాం. పైరసీని అరికట్టడానికి ఎంతో శ్రమించాం. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం. దేశవ్యాప్తంగా పైరసీ సమస్య ఉంది. నిందితుడు రవి.. కొత్త టెక్నాలజీ ఉపయోగించి సినిమాలు అప్‌లోడ్ చేసేవాడు. రవిని విచారిస్తున్నాం. నిందితుడికి అంతర్జాతీయ లింకులు ఉన్నాయి. ఐబొమ్మ రాకెట్ ఛేదించేందుకు జాతీయ సంస్థల సపోర్టు తీసుకుంటాం. ఉదయం విడుదలైన సినిమా… సాయంత్రానికి ఐబొమ్మ రవి వద్ద ఉండేది. ఐబొమ్మ రవిపై మూడు పైరసీ కేసులు ఉన్నాయి. రవి వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరిగింది. రవి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది డిజిటల్ అరెస్ట్ అయ్యారు. ఐబొమ్మ రవి వెనుక డార్క్ వెబ్‌సైట్లు ఉన్నాయి.
రవి స్వస్థలం విశాఖపట్నం. మహారాష్ట్రలో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. రవి.. పోలీసులకే సవాల్ విసిరాడు. 50 లక్షల మంది సబ్‌స్కైబర్ల డేటా ఇమంది రవి దగ్గర ఉంది. ఈ డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అమెరికా, నెదర్లాండ్స్‌లో సర్వర్లను పెట్టాడు. రవి హార్ట్ డిస్క్‌లో అన్ని సినిమాలు ఉన్నాయి. టెలిగ్రామ్ యాప్‌లో కూడా పైరసీ సినిమాలు అప్‌లోడ్ చేశాడు. నిందితులు ఎక్కడ ఉన్నా పోలీసులు పట్టుకుంటారు. పైరసీలో సినిమాలు చూసే వాళ్లపై నిఘా పెట్టామన్నారు. రవి చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో చాలా మంది నష్టపోయారు. రవిపై ఐదు కేసులు నమోదు చేశాం. ఇప్పటి వరకు రవి రూ.20 కోట్లు సంపాదించాడు. రవి నుంచి రూ.3 స్వాధీనం చేసుకున్నారు. సినిమా పరిశ్రమకు పైరసీ వల్ల చాలా నష్టం జరిగింది. పైరసీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోందన్నారు.
21వేల సినిమాలు హార్ట్ డిస్క్‌లో ఉన్నాయి. రవితో సినీ పరిశ్రమకు తీరని నష్టం జరిగింది. నిందితుడిపై ఐటీ సెక్షన్ల కింది కేసులు నమోదు చేశాం. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం. 1970 మూవీస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలు రవి వద్ద ఉన్నాయి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఐబొమ్మ రవిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేశారు. ఐబొమ్మ వెనుక పెద్ద రాకెట్ ఉంది. రవి.. పలు పేర్లతో లైసెన్స్‌లు, పాన్ కార్డులు తీసుకున్నాడు. నిందితుడు డేటా ఎక్కడ నుంచి సేకరించారనే దానిపై విచారిస్తున్నాం’ అని తెలిపారు.
వందకుపైగా పైరసీ వెబ్‌సైట్లు
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దూకుడు పెంచారు. ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైల్లో సమగ్రంగా విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గెట్టింగ్ అప్, ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీలకు సీఈవోగా ఉన్నారు రవి. తన టీంతో కలిసి యూకే నుంచి సర్వర్లు హ్యాకింగ్ చేస్తున్నారు. ముంబైలో ఆయన ఎంబీఏ పూర్తి చేశారు. లవ్ మ్యారేజ్ చేసుకుని కొన్ని రోజులకే రవి తన భార్యతో విడిపోయారు. కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టాలో నివాసం ఉంటున్నారు.
వివిధ వీపీఎన్‌లతో పలు లొకేషన్లు మారుస్తూ.. వెబ్‌సైట్‌లో సినిమాలు అప్‌లోడ్ చేస్తున్నారు. పైరసీ సినిమాల అప్‌లోడ్ కోసం వందకు పైగా వెబ్‌సైట్‌లు కొనుగోలు చేశారు. పైరసీ బయటపడి ఒక వెబ్‌సైట్ తొలగించినా.. మరో వెబ్‌సైట్‌ను వాడుకుంటూ సినిమాలు అప్‌లోడ్ చేస్తున్నారు. రవి ఇంట్లో స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్క్‌లలో రెండువేలకు పైగా సినిమాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. పైరసీ నెట్‌వర్క్‌ను ప్రపంచ స్థాయిలో విస్తరించారు. కూకట్‌పల్లిలోని ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, ల్యాప్ టాప్‌లు, మొబైల్ ఫోన్స్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి తరలించారు. ఇప్పటికే రవిపై 7 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
The post CP VC Sajjanar: ఐబొమ్మతో రవి అరెస్ట్ తో వెలుగులోనికి సంచలన విషయాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
CP VC Sajjanar: ఐబొమ్మతో రవి అరెస్ట్ తో వెలుగులోనికి సంచలన విషయాలు
Categories: