hyderabadupdates.com Gallery Kinjarapu Atchannaidu: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు

Kinjarapu Atchannaidu: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు

Kinjarapu Atchannaidu: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు post thumbnail image

 
 
ఏపీలో రైతులకు వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 19న “అన్నదాత సుఖీభవ” పథకం రెండో విడ‌త నిధులు జ‌మ చేయ‌నున్నట్లు తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం పీఎం కిసాన్ నిధులు అదేరోజు విడుద‌ల చేయ‌నున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం వాటా క‌లిపి రైతుల ఖాతాల్లో జ‌మ చేయనున్న నేప‌థ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో కలిపి మొత్తం రూ.7వేలు అందించనున్నామ‌ని తెలిపారు.
 
రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేతుల మీదుగా వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మాడ క్యాంప్ కార్యాల‌యం నుంచి రాష్ట్ర వ్యవ‌సాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి , డైరెక్ట‌ర్, 26 జిల్లాల జేడీల‌తో టెలీకాన్ఫెరెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా అధికారులకు ప‌లు సూచ‌లు చేశారు. ఈ కార్యక్రమానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని వ్యవ‌సాయ శాఖ అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.
 
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందాలని, రైతులకు చేయూతనివ్వడం భారం కాదు.. బాధ్యత అని గుర్తెరగాల‌ని అన్నారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ పథకం రెండో విడ‌త అమలు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాల‌ని అందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. NPCAలో ఇన్ యాక్టివ్ గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని క్షేత్ర స్ధాయిలో వ్యవసాయ శాఖ అధికారులు స‌న్వ‌యం చేసుకుని ప‌ర్య‌వేక్ష‌ణ చేసి వాటిని సరిచేయాల‌ని సూచించారు. ఆర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్నవారు ఆన్లైన్లో రైతులు నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు.
రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద రెండో విడత 46,62,904, లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని అధికారులు మంత్రికి వివ‌రించారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద రూ.3077.77 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు విడుద‌ల చేయ‌నున్నాయని చెప్పారు. ఈ పథకంపై సందేహాల నివృత్తి కోసం టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అన్నదాత సుఖీభవ అందుకునే రైతుల సెల్‌ఫోన్లకు ఒక రోజు ముందే ‘ సందేశాలు వెళ్లాలి. రైతులు తమ ఖాతాలను యాక్టివేట్‌ చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలి’’ అని తెలిపారు.
 
తొలి విడ‌త‌లో జ‌మ‌కానివి రైతుల నుంచి వ‌చ్చిన పిర్యాదులు ప‌రిశీలించి అర్హ‌త ఉన్న వారికి అన్నదాత సుఖీభ‌వ ప‌థ‌కం అందేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పండ‌గ వాతావ‌ర‌ణంలో జ‌ర‌గాల‌ని అధికారుల‌కు సూచించారు. వెబ్‌ల్యాండ్‌లో న‌మెదు కానివి, అర్హ‌త ఉన్న‌వారికి అంద‌లేద‌ని రైతుల నుంచి వ‌స్తున్న ఫిర్యాదులు ప‌రిశీలించి అర్హ‌త ఉన్న రైతుల‌కు ప‌థ‌కం అందేలాచ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. కింది స్ధాయి సిబ్బంది గ్రామాల్లో ప‌ర్య‌టించి రైతులకు ప్ర‌త్యేక అవ‌గాహన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు.
 
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి – మంత్రి అచ్చెన్నాయుడు
 
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళి మండలం నిమ్మడ క్యాంపు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారి నుండి నేరుగా సమస్యలను తెలుసుకొని వ్యక్తిగతంగా అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు అక్కడికక్కడే ఫోన్ లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
The post Kinjarapu Atchannaidu: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pawan Kalyan: భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్‌ సీరియస్‌Pawan Kalyan: భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్‌ సీరియస్‌

    పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్‌ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతల

Sabarimala: శబరిమల ఆలయంలో యోగదండం మాయం ?Sabarimala: శబరిమల ఆలయంలో యోగదండం మాయం ?

Sabarimala : శబరిమల గర్భగుడి నుండి బంగారు పూత కోసం తీసుకెళ్లిన అమూల్యమైన యోగదండం (పవిత్ర దండం) తిరిగి ఇవ్వబడలేదని సమాచారం బయటపడింది. పురాతన యోగదండం 2018లో బంగారు పూత కోసం తీసుకోబడింది. అయితే, బంగారు తాపడం తర్వాత కొత్తగా తయారు

Sabarimala: అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయిన శబరిమలSabarimala: అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయిన శబరిమల

    కేరళలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్నటి నుంచే(సోమవారం) దర్శనాలు ప్రారంభం కావడంతో వేలాదిగా భక్తలు తరలివస్తున్నారు. కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉండటంతో దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది. అయితే సరైన