hyderabadupdates.com movies జై హనుమాన్… ఎట్టకేలకు కదిలిన వర్మ?

జై హనుమాన్… ఎట్టకేలకు కదిలిన వర్మ?

పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన ‘హనుమాన్’ సినిమా రిలీజై రెండేళ్లు కావస్తోంది. ఆ సినిమా చివర్లో దీని సీక్వెల్ గురించి హింట్ ఇచ్చారు. అప్పట్నుంచి ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఈ సినిమా ముందుకు కదలడం లేదు. ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రను కన్నడ నటుడు రిషబ్ శెట్టి పోషించబోతున్నట్లు ప్రకటన వచ్చి కూడా ఏడాది దాటిపోతోంది. కానీ ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి మాత్రం ముహూర్తం కుదరడం లేదు.

ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ వేరే సినిమా కూడా ఏదీ మొదలుపెట్టనే లేదు. రకరకాల ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్నాడే తప్ప ఏదీ ముందుకు కదలడం లేదు. మరి ‘జై హనుమాన్’ను అయినా ముందుకు తీసుకెళ్లొచ్చు కదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఐతే ఎట్టకేలకు అందుకు ముహూర్తం కుదిరినట్లు సమాచారం.

2026 జనవరి నుంచే ‘జై హనుమాన్’ షూటింగ్ మొదలు కానుందట. కొత్త ఏడాదిలో వరుసగా ఆరు నెలల పాటు ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చాడట రిషబ్ శెట్టి. ‘జై హనుమాన్’ ఆలస్యం కావడానికి రిషబ్ శెట్టి బిజీగా ఉండడం కూడా ఒక కారణం. ‘కాంతార: చాప్టర్-1’ సినిమాకు అతను రెండేళ్ల పాటు అంకితమై ఉన్నాడు. ఆ చిత్రంతో పాటే ‘జై హనుమాన్’ షూట్‌లో పాల్గొందామని అనుకున్నా కుదరలేదు.

ప్రశాంత్ వర్మ కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల అది సాధ్యపడలేదు. ఐతే ఇప్పుడు ఇద్దరూ వీలు చూసుకుని సినిమాను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘హనుమాన్’ను ప్రొడ్యూస్ చేసిన నిరంజన్ రెడ్డితో ప్రశాంత్ వర్మకు విభేదాలు తలెత్తాయి. ‘జై హనుమాన్’ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. 2027 సంక్రాంతికి ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలున్నాయి.

Related Post

విశాల్.. దీన్నయినా బయటికి తెస్తాడా?విశాల్.. దీన్నయినా బయటికి తెస్తాడా?

ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సహవాసం చేయడం తెలుగు వాడైన తమిళ హీరో విశాల్‌కు అలవాటే. అతను నడిగర్ సంఘంలోకి అడుగు పెట్టిన దగ్గర్నుంచే అందులో ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇక తనతో పని చేసే నిర్మాతలు, దర్శకులతో గొడవలు