దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న కారు బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తును ఎన్ఐఏ అధికారులు ముమ్మురం చేశారు. ఎన్ఐఏ దర్యాప్తులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ నబీ వీడియో బయటపడింది. ఎర్రకోట వద్ద కారు బాంబు దాడికి పాల్పడడానికి ముందు ఉమర్ ఆ వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడి గురించి ఉమర్ ఆ వీడియోలో మాట్లాడినట్లు సమాచారం. ‘ఆత్మాహుతి దాడిని అపార్థం చేసుకున్నారు. ఇదొక బలిదానం’ అని చెప్పినట్లు తెలుస్తోంది. చనిపోయే స్థలం, సమయం, పరిస్థితుల గురించి కూడా ఉమర్ నబీ మాట్లాడినట్లు సమాచారం. నవంబర్ 9వ తేదీన అల్ఫల యూనివర్సిటీలో ఉమర్ వీడియో రికార్డు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. మరుసటి రోజు నవంబర్ 10వ తేదీన అతడు ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఇందుకోసం ఐ20 కారును ఉపయోగించాడు. ఈ ఆత్మాహుతి దాడిలో 13 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దర్యాప్తు సంస్థలు ఉమర్‌కు సహకరించిన అతడి బంధువుతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నాయి.
డిసెంబర్ 6న (బాబ్రీ మసీదు కూల్చివేత రోజు) భారీ పేలుళ్లకు ఉమర్ నబీ ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అంతలోనే ఫరీదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్ కుట్ర బయటపడింది. ఇదికాస్త ఉమర్‌లో భయాందోళనకు దారితీయడం… చివరకు ఎర్రకోట సమీపంలో ముందుగానే పేలుడు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈనెల 10న చోటుచేసుకున్న ఈ పేలుడు ఘటనలో 13 మంది మరణించారు. ఈ టెర్రర్ మాడ్యూల్ గత ఏడాది నుంచి ఓ సూసైడ్ బాంబర్ కోసం అన్వేషిస్తోందట. దిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడైన డా.ఉమర్ నబీ దీనికోసం ముమ్మర ప్రయత్నాలు చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుల విచారణలో… ఉమర్ ఓ కరడుగట్టిన ఉగ్రవాది అని, తమ కార్యకలాపాల కోసం ఓ ఆత్మాహుతి బాంబర్ అవసరమని అతడు పట్టుబట్టినట్లు తెలిసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర దాడులు చేయడం గురించి ప్రతిసారీ అతడు ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని వార్తలు వచ్చాయి.
The post Red Fort Bomber: సూసైడ్ బాంబింగ్ పై డాక్టర్ ఉమర్ నబీ సంచలన వీడియో appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Red Fort Bomber: సూసైడ్ బాంబింగ్ పై డాక్టర్ ఉమర్ నబీ సంచలన వీడియో
Categories: