hyderabadupdates.com Gallery Sabarimala: అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయిన శబరిమల

Sabarimala: అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయిన శబరిమల

Sabarimala: అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయిన శబరిమల post thumbnail image

 
 
కేరళలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్నటి నుంచే(సోమవారం) దర్శనాలు ప్రారంభం కావడంతో వేలాదిగా భక్తలు తరలివస్తున్నారు. కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉండటంతో దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది. అయితే సరైన సౌకర్యాలు లేక భక్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది మండల- మకరవిళక్కు మండల పూజ ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమై… డిసెంబర్‌27న ముగియనుంది. ఆ నేపేథ్యంలోనే శబరిమల భక్తులతో కిటకిటలాడింది. తొలిరోజే భక్తజన సందోహం మెగా రికార్డు(1 లక్ష 25 వేలమందికి) రేంజ్‌లో అయ్యప్ప దర్శనానికి తరలివచ్చారు.
అదీగాక ప్రస్తుతం 22 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం కోసం వర్చువల్‌గా బుక్‌ చేసుకున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఈ సందర్భంగా ట్రావెన్‌కోర్‌ దేవస్థానం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది కూడా. కాగా, మండల సీజన్ కోసం ఆదివారం శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోగా.. సోమవారం ఉదయం నుంచి నెయ్యాభిషేకాలు మొదలయ్యాయి. దీంతో.. ముర్ము ఇరుముడిలోని ముద్ర టెంకాయలోని నేతితో తొలుత అయ్యప్పకు అభిషేకం చేశారు. అలా.. మండల సీజన్‌లో తొలి నెయ్యాభిషేకం రాష్ట్రపతి ముర్ము చేయించినట్లయిందని టీడీబీ పేర్కొంది.
శబరిమలలో జై జగన్‌ నినాదాలు !
 
శబరిమలలో ఆయ్యప్ప ఆలయానికి వెళ్లే సమయంలో మాలధారులంతా స్వామిని ధ్యానిస్తూ లీనమై పోతారు. అయితే అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన వైసీపీ నాయకులు మాత్రం శబరిమల అయ్యప్ప స్వామిగుడికి కాలినడకన వెళుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బ్యానర్‌ను ప్రదర్శించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. కేరళలో పంప నుంచి సన్నిధానానికి వెళుతూ జగన్‌ 2.0 అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించడంతోపాటు జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
The post Sabarimala: అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయిన శబరిమల appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Maoist Party: మావోయిస్టులకు మరో బిగ్ షాక్ !Maoist Party: మావోయిస్టులకు మరో బిగ్ షాక్ !

Maoist Party : మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మల్లోజుల బాటలో కీలక నేతలు నడిచేందుకు సిద్ధమయ్యారు. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు రెడీ అయ్యారు. గురువారం