hyderabadupdates.com Gallery DK Shivakumar: సీఎం మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తికర వ్యాఖ్యలు

DK Shivakumar: సీఎం మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తికర వ్యాఖ్యలు

DK Shivakumar: సీఎం మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తికర వ్యాఖ్యలు post thumbnail image

 
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి కావాలని ఆశ పడటంలో తప్పు లేదన్నారు. మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులు బహిరంగంగా కోరినట్లు తెలుస్తోంది. దీనిపై డీకే మాట్లాడుతూ… ‘ఆశ పడటంలో తప్పేంటి?. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మంత్రులుగా చేసే అవకాశం సీఎంకు ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారందరికీ ఆశ ఉంటుంది. అది తప్పు అని ఎలా చెబుతాం?. వారిలో చాలామంది పార్టీ కోసం కష్టపడినవారు, త్యాగాలు చేసినవారు ఉన్నారు’ అని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. ఆ ప్రశ్న జ్యోతిషుడినే అడగాలని వ్యాఖ్యానించారు.
 
కర్ణాటక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. ఖర్గే నివాసంలోనే వీరిరువురూ సుదీర్ఘంగా చర్చించుకున్నారు. మంత్రివర్గ విస్తరణ పైనే వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఖర్గేతో డీకే ఆదివారమే సమావేశమై చర్చలు జరిపారు. ‘పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు సమావేశం కావడం సర్వసాధారణం. ఇందులో కొత్తేమీ లేదు. పార్టీకి సంబంధించిన అంశాలనే మాట్లాడుకున్నాం’ అని డీకే ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఒకవేళ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు అధిష్ఠానం ఆమోదం తెలిపితే… సిద్ధరామయ్య పూర్తికాలం సీఎంగా కొనసాగేందుకు అనుమతి లభించినట్లేనని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 
ఢిల్లీలో ఎవరికి వారే
 
కర్ణాటక కాంగ్రెస్‌ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సీఎం సిద్దరామయ్య సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుని, సాయంత్రం ప్రధాని మోదీని కలిశారు. 40 నిమిషాలపాటు చర్చించారు. ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌ 3రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా, సీఎం ఒంటరిగానే ప్రధానిని కలవడం గమనార్హం. డీకే శివకుమార్‌ ఢిల్లీ నుంచి 3 గంటలకు బెంగళూరు బయల్దేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో రాత్రి సిద్దరామయ్య భేటీ అయ్యారు. ఢిల్లీలో మూడు రోజులు గడిపిన డీకే శివకుమార్‌, తన తమ్ముడు సురేశ్‌తో కలసి ఆదివారం ఖర్గేతో భేటీ అయ్యారు. కాగా, సీఎం సిద్దరామయ్య శనివారం మధ్యాహ్నం రాహుల్‌గాంధీని కలిసిన విషయం తెలిసిందే. అప్పటికే ఢిల్లీకి డీకే శివకుమార్‌ కూడా చేరుకున్నారు. అయినా రాహుల్‌గాంధీని, ఖర్గేని సీఎం ఒంటరిగానే కలిశారు. మొత్తంగా ముుఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మూడు రోజులుగా ఢిల్లీలో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారు.
The post DK Shivakumar: సీఎం మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తికర వ్యాఖ్యలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Delhi: ఢిల్లీ పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలుDelhi: ఢిల్లీ పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు

    ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనతో కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అయితే, ఈ ఘటనలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బాంబు బ్లాస్ట్ ఘటనలో ఇప్పటివరకు

Minister Giriraj Singh: 100% పత్తి కొనుగోలు చేస్తాం – కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌Minister Giriraj Singh: 100% పత్తి కొనుగోలు చేస్తాం – కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌

Giriraj Singh : తెలంగాణ రైతులు పండించే పత్తిని 100% సీసీఐ ద్వారా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ (Giriraj Singh) ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను 110 నుంచి 122కి

తన డైట్‌ గురించి ఈ ముద్దుగుమ్మ ఏమందంటే..!తన డైట్‌ గురించి ఈ ముద్దుగుమ్మ ఏమందంటే..!

గ్లామర్‌ హీరోయిన్‌ రాశి ఖన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరంగా పంచుకుంది. తాను ఒకప్పుడు లావుగా ఉండేదానని, ఆ సమయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుందని చెప్పింది. చిన్నప్పటి నుంచే తాను తినడం చాలా