hyderabadupdates.com movies లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు

లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు

ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్‌ నివేదిక ఆధారంగా చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ.54.87 కోట్లను నల్లధనంగా మార్చినట్లు సిట్‌ తేల్చింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉన్న పలు ఆస్తులు జప్తు కానున్నాయి. అధికార అండతో మోసపూరిత భూ లావాదేవీలు జరిగినట్లు సిట్‌ నిర్ధారించింది. అవినీతి నిరోధక, నేర చట్టాల ప్రకారం జప్తును అనుమతించాలంటూ సిట్‌ సిఫార్సు చేసింది.

డీజీపీ తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ జారీ చేశారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌ రెడ్డి, మోహిత్‌ రెడ్డి భార్య లక్ష్మీ పేరిట ఉన్న ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. చెవిరెడ్డి మరో కుమారుడు హర్షిత్‌రెడ్డి ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్‌ గుర్తించింది. కమీషన్ల ద్వారా చెవిరెడ్డి కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు నివేదిక ఇచ్చింది. సిట్‌ విజ్ఞప్తి మేరకు చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కాంలో చెవిరెడ్డి 63.72కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని సిట్ తేల్చింది.

మరోవైపు ఈ స్కాంలో కేసులో నిందితులకు షాక్ తగిలింది. ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఏసీబీ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పొందిన నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప.. ముగ్గురిని ఈ నెల 26లోపు సరెండర్ కావాలని ఆదేశాలుజారీచేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.

Related Post