ఆర్జేడీ సుప్రీం నేతగా పార్టీ శ్రేణుల గుండెల్లో నిలిచిపోయిన లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఒక కిడ్నీ దానంచేసే దమ్ములేని వాళ్లు నాపై నిందలు వేస్తున్నారని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తండ్రి మీద అచంచల ప్రేమతో తన కిడ్నీ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తుండటంపై ఆమె అసహనం వ్యక్తంచేశారు. కిడ్నీలు విఫలమై ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్న వాళ్లకు కిడ్నీని దానం ఇచ్చాకే నాపై విమర్శలు చేయాలని విమర్శలు చేసే వాళ్లకు ఆమె దీటైన సవాల్ విసిరారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘లాలూపై మొసలి కన్నీరు కార్చేవాళ్లు వెంటనే ఆస్పత్రులకు వెళ్లి ఒక కిడ్నీ దానంచేసి రావాలి. అప్పుడు నాది మురికి కిడ్నీ యా కాదా అనే చర్చకు కూర్చోవాలి. తండ్రికి దానమిచ్చిన కూతురి కిడ్నీని మురికిది అంటూ హేయమైన వ్యాఖ్యానాలు చేసే వాళ్లు తొలుత కిడ్నీ ఇచ్చి లాలూ పట్ల తమ నిజమైన విధేయతను చాటుకోవాలి. హరియాణా మహాపురుషుడు, మద మెక్కిన పాత్రికేయులు ముందు కిడ్నీ ఇవ్వాలి’’ అని అన్నారు.
తేజస్వీ యాదవ్ సన్నిహిత నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్‌నుద్దేశిస్తూ హరియాణా మహా పురుషుడు అని రోహిణి వ్యాఖ్యానించారు. ‘‘ఒక బాటిల్ రక్తం దానం చేస్తే శరీరం కృషించిపోయే వాళ్లు కూడా కిడ్నీ దానంపై ప్రసంగాలిస్తారా?’’అని రోహిణి ఆగ్రహం వ్యక్తంచేసింది. మురికి కిడ్నీ ఇచ్చావంటూ సొంత కుటుంబ సభ్యులు(తేజస్వీ యాదవ్) ఇంట్లోంచి తరిమేశారని, వాళ్లతో బంధం తెంచుకున్నానని రోహిణి ఇటీవల వ్యాఖ్యానించడం తెల్సిందే. తన సోదరిని అవమానించిన వాళ్ల అంతు చూస్తానని లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు.
నా తల్లిదండ్రులను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు – తేజ్ ప్రతాప్
తన తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవీలు శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నారని ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై వెంటనే దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా ప్రధాన మంత్రి మోదీ, హోం మంత్రి అమిత్ షాలతోపాటు బిహార్ రాష్ట్ర ప్రభుత్వానికి ‘ఎక్స్’ వేదికగా విజ్ఞప్తి చేశారు. ‘ముఖస్తుతి చేసేవారి కుట్రపూరిత రాజకీయాలవల్ల ఆర్జేడీని బలమైన పార్టీగా మార్చడానికి ఎన్నో ఏళ్లు కష్టపడిన వారిని విస్మరిస్తున్నారు. దురాశ, అహంకారంతో విర్రవీగుతున్న తేజస్వీ సహాయకులు నా తల్లిదండ్రులను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. నా తండ్రి ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారు ఒత్తిడిని తట్టుకోలేరు. ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించాలని అభ్యర్థిస్తున్నా’ అని కోరారు. తన సోదరి రోహిణికి జరిగిన అవమానంపై తమ పార్టీ మౌనంగా ఉండబోదని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు.
నేనే పరిష్కరిస్తా – లాలూ
కుటుంబ కలహాలపై మొదటిసారిగా లాలూ ప్రసాద్ స్పందించారు. ఇది తమ కుటుంబ సమస్యని, తానే పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.
The post Rohini Acharya: దమ్ముంటే కిడ్నీ దానమిచ్చి చర్చకు రండి – లాలూ కుమార్తె రోహిణి ఆచార్య appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Rohini Acharya: దమ్ముంటే కిడ్నీ దానమిచ్చి చర్చకు రండి – లాలూ కుమార్తె రోహిణి ఆచార్య
Categories: