hyderabadupdates.com Gallery Suresh Kumar: ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గా మారిన బీజేపీ ఎమ్మెల్యే

Suresh Kumar: ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గా మారిన బీజేపీ ఎమ్మెల్యే

Suresh Kumar: ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గా మారిన బీజేపీ ఎమ్మెల్యే post thumbnail image

 
 
బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సురేష్‌ కుమార్‌ మంగళవారం ట్రాఫిక్‌ పోలీస్‌ అవతారమెత్తారు. బెంగుళూరు నగరంలోని భాష్యం సర్కిల్‌ దగ్గర రెండు గంటలపాటు ట్రాఫిక్‌ పోలీస్‌గా విధులు నిర్వహించారు. బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు ప్రారంభించిన ‘ట్రాఫిక్‌ కాప్‌ ఫర్‌ ఎ డే’అనే వినూత్న ప్రయోగంలో భాగంగా ఆయన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ పాత్ర పోషించారు.
 
ట్రాఫిక్‌ పోలీసు జాకెట్‌ ధరించిన ఆయన, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి పనిచేశారు. ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు ట్రాఫిక్‌ నిర్వహించడంతోపాటు వారితో సంభాషించారు. సిగ్నల్‌ కంట్రోల్‌ పోస్ట్‌ను నిర్వహించిన ఆయన.. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినవారిని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ‘ఒక రోజు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా పనిచేయడం నాకు మంచి అనుభవం. ఈ పనిని నేను ఆస్వాదించాను. బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసుల ఈ చొరవ స్వాగతించదగినది.’ అని ఆయన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, ఇక నుంచి ప్రతి సోమవాకం ఒక గంట పాటు ట్రాఫిక్‌ నిర్వహణలో పోలీసులకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
 
‘ఈ రోజు నాకు ఒక పండుగలా ఉంది. ప్రజలు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తున్నారా? వాటికి ఎలా స్పందిస్తున్నారు? వంటి విషయాలను వ్యక్తిగతంగా తెలుసుకున్నాను. ఇది జీవితంలో మంచి అనుభవం’ ఓ వీడియోలో పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నిర్వహణలో పోలీసులకు సహకరించాలనుకునే పౌరులకు ‘బీటీపీ ఏఎస్‌టీఆర్‌ఏఎమ్‌’ యాప్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకునే అవకాశాన్ని బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు కల్పించారు. ఇందులో నమోదు చేసుకున్న పౌరులు ఆ పరిధిలోని స్టేషన్‌ అధికారులు లేదా సిబ్బందితో కలిసి పనిచేసే అవకాశాన్ని అందిస్తుంది.
The post Suresh Kumar: ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ గా మారిన బీజేపీ ఎమ్మెల్యే appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తెలంగాణ కొత్త సీఎస్‌గా జయేష్ రంజన్‌..?తెలంగాణ కొత్త సీఎస్‌గా జయేష్ రంజన్‌..?

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కీల‌క‌మైన ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టికే పాల‌నా ప‌రంగా అస్త‌వ్య‌స్తంగా మారింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ త‌రుణంలో గ‌తంలో 10 ఏళ్ల‌పాటు ఏలిన కేసీఆర్ హ‌యాంలో చ‌క్రం తిప్పిన

రైతుల‌కు స్థిర ఆదాయం స‌ర్కార్ ల‌క్ష్యంరైతుల‌కు స్థిర ఆదాయం స‌ర్కార్ ల‌క్ష్యం

అమ‌రావ‌తి : రైతుల‌కు స్థిరమైన ఆదాయం క‌ల్పించ‌డం త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఇందులో భాగంగా ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియోను అనుసరించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, మెట్రిక్ టన్నుకు సగటున రూ.19,579

‘Kiss Kiss Bang Bang’ Video Song from They Call Him OG Released, Goes Viral Online‘Kiss Kiss Bang Bang’ Video Song from They Call Him OG Released, Goes Viral Online

The blockbuster gangster action drama They Call Him OG, starring Power Star Pawan Kalyan and directed by Sujeeth, continues to make waves even after its successful theatrical run. The makers