తమ నాయకుడు వెళుతుంది కోర్టుకు..! అక్రమ ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి, బెయిలుపై వచ్చి.. దాదాపు ఆరేళ్ల తర్వాత కోర్టుకు హాజరయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఈ సమయంలో హైదరాబాదులో బేగంపేట నుంచి నాంపల్లి కోర్టు వరకు జగన్ అభిమానులు హంగామా సృష్టించారు. బేగంపేట్ నుంచి కోర్టు వరకు భారీ ర్యాలీ చేపట్టిన అభిమానులు.. ర్యాలీలో మహేష్ బాబు – జగన్ – కేటీఆర్ ఫ్లెక్సీలతో హల్చల్ చేశారు.
2029లో రప్పా రప్పా.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించడం అందర్నీ ఆశ్చర్యాన్ని గురి చేసింది. తెలంగాణ రాజధాని నడిబొడ్డున ఈ తరహా ప్రదర్శన, తమ ఉనికిని గట్టిగా చాటుకోవాలనే వారి ఆకాంక్షను ప్రతిబింబిస్తోంది!
అక్రమాస్తుల కేసులో జగన్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ రాకతో అక్కడికి చేరుకున్న వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోర్టు సమీపంలో రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేశారు. ‘2029లో రప్పా రప్పా’ అంటూ రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శించారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పుష్ప సినిమాలోని ఈ డైలాగులు
గతంలో పల్నాడు జగన్ పర్యటనలో ఓ యువకుడు ప్రదర్శించాడు. ఆ తర్వాత అతనిని పోలీసులు అరెస్టు చేశారు. అటువంటి వ్యాఖ్యలను జగన్ ఖండించకపోగా సినిమా డైలాగు అంటే తప్పేంటి అంటూ సమర్థించారు. దీంతో ఆయన అభిమానులు ఇక ఆగడం లేదు. ఎక్కడ జగన్ పర్యటన జరిగినా రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు కోర్టుకు వెళ్లే సమయంలో కూడా అటువంటి రాతలను ప్రదర్శించడం విమర్శలకు దారి తీసింది.
ఈరోజు జగన్ కోర్టుకు హాజరైన సందర్భంలో అభిమానుల హడావుడి అంతా ఇంతా కాదు. బేగంపేట నుంచి నాంపల్లి కోర్టు వరకు ర్యాలీ చేపట్టారు. కోర్టుకి కొద్ది దూరంలో జనాన్ని పోలీసులు ఆపేశారు. అక్కడే ఈ రప్ప రప్ప అనే పోస్టర్లను అభిమానులు ప్రదర్శించారు. జగన్ మాత్రం తమ అభిమానులకు అభివాదం చేసుకుంటూ కోర్టు నుంచి లోటస్పాండ్ కి వెళ్ళిపోయారు. ఆయన వెంట అభిమానులు అనుసరించారు. జగన్ వస్తే జనం పోగవుతారు అనే సంకేతాలను ఇవ్వడానికి జన సమీకరణ చేసినట్లు, తద్వారా కోర్టుకు హాజరుకాకుండా ఉండవచ్చు అని భావిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనా కోర్టుకు హాజరైన ఈ సందర్భంలో ఇటువంటి పోస్టర్లను ప్రదర్శించడం మాత్రం ఖండించాల్సిన విషయమే..!