hyderabadupdates.com movies బాలయ్యని కవ్విస్తున్న రణ్వీర్ సింగ్

బాలయ్యని కవ్విస్తున్న రణ్వీర్ సింగ్

డిసెంబర్ 5 విడుదల కాబోతున్న అఖండ 2 తాండవం కోసం నార్త్ లో ప్రత్యేకంగా ప్రమోషన్లు చేస్తున్న సంగతి తెలిసిందే. పబ్లిసిటీ బోణీనే ముంబై నుంచి మొదలుపెట్టి తెలుగు మీడియా సైతం చూడని కొన్ని విజువల్స్ ని అక్కడి ప్రతినిధులకు ప్రత్యేకంగా చూపించారు. హైందవ ధర్మం మీద బలమైన విషయాలున్న అఖండ 2 బాలీవుడ్ మార్కెట్ లో పెద్ద ఎత్తున వర్కౌట్ అవుతుందనే నమ్మకం టీమ్ లో బలంగా ఉంది. అందుకే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అవుట్ డోర్ క్యాంపైన్లు విస్తృతంగా చేస్తున్నారు. ఓపెనింగ్స్ బాగా వస్తే పాజిటివ్ టాక్ ద్వారా కార్తికేయ 2, కాంతార లాంటి ఫలితం అందుకోవచ్చని వాళ్ళ నమ్మకం.

ఇదంతా బాగానే ఉంది కానీ అదే రోజు రణ్వీర్ సింగ్ దురంధర్ పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది. ఇదేదో ఆషామాషీగా తీసుకునే మూవీ కాదు. చాలా పెద్ద బడ్జెట్ తో తెరకెక్కించారు. ట్రైలర్ నాలుగు నిమిషాలు వదిలారంటే ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అవుట్ అండ్ అవుట్ వయొలెంట్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన దురంధర్ లో భారీ క్యాస్టింగ్ ఉంది. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ తో పాటు సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. ఇన్ని అట్రాక్షన్లు ఉంటే మాస్ దీని వైపు చూడకుండా ఉంటారా. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన దురంధర్ బడ్జెట్ వంద కోట్ల పైమాటే.

సో బాలయ్యని ఉత్తరాదిలో రణ్వీర్ సింగ్ గట్టిగానే కవ్వించబోతున్నాడు. నిజానికి దురంధర్ వాయిదా పడుతుందని ఓ నెల క్రితం ముంబై వర్గాల్లో వార్త చక్కర్లు కొట్టింది. కానీ ప్రొడక్షన్ టీమ్ పట్టుబట్టి టార్గెట్ రీచ్ అయ్యేలా చూసుకుంది. బిజినెస్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా చక్కబెట్టుకుంటూ వస్తున్న అఖండ 2 హిందీలో ఇంతకు అమ్ముడుపోయిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. థియేటర్ల కేటాయంపు మరీ దురంధర్ స్థాయిలో ఆశించలేం కానీ ఉన్నంతలో మంచి కౌంట్ వస్తే పాజిటివ్ టాక్ తో తర్వాత స్క్రీన్లు పెంచుకోవచ్చు. మరి బాలయ్య వర్సెస్ రణ్వీర్ సింగ్ బాక్సాఫీస్ యుద్ధంలో ఎవరు విజేతలో చూడాలి.

Related Post

ది ‘కింగ్’ ఖాన్ ఈజ్ బ్యాక్ది ‘కింగ్’ ఖాన్ ఈజ్ బ్యాక్

చాలా ఏళ్ల పాటు సరైన విజయం లేక ఇబ్బంది పడ్డ షారుఖ్ ఖాన్.. 2023లో ‘పఠాన్’తో బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు. అది ఏకంగా రూ.1200 కోట్ల వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. దాని కంటే ముందు షారుఖ్ నటించిన ‘జీరో’

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారుదృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే పోటీ పడే రేంజులో ప్రతి శుక్రవారం కొత్త కంటెంట్లు ఇస్తూనే ఉన్నాయి. సినిమాలే కాదు వెబ్ సిరీస్ లు