hyderabadupdates.com Gallery Nitish Kumar: బిహార్‌ ఎన్డీయే శాసనసభాపక్షనేతగా నీతీశ్‌ కుమార్‌

Nitish Kumar: బిహార్‌ ఎన్డీయే శాసనసభాపక్షనేతగా నీతీశ్‌ కుమార్‌

Nitish Kumar: బిహార్‌ ఎన్డీయే శాసనసభాపక్షనేతగా నీతీశ్‌ కుమార్‌ post thumbnail image

 
 
బిహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదుపరి ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌ ఖరారయ్యారు. ఈ మేరకు ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు… తమ కూటమి నేతగా నీతీశ్‌ను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. ఇందుకు గవర్నర్‌ కూడా ఆమోదం తెలిపారు. దీంతో నవంబర్‌ 20న రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీతీశ్‌ పదోసారి ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు.
పట్నాలోని గాంధీ మైదాన్‌ వేదికగా నీతీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌లతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ నేత ప్రేమ్‌ కుమార్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవి జేడీయూ అభ్యర్థికి ఇచ్చేందుకు ఎన్డీయే పక్షాలనడుమ అంగీకారం కుదినట్లు తెలిసింది.
మంత్రి పదవుల కోసం ముమ్మర లాబీయింగ్‌
 
మంత్రివర్గానికి సంబంధించి ఎన్డీయే కూటమిలో మధ్య ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ పదవుల కోసం నేతలు ముమ్మర లాబియింగ్‌ కొనసాగిస్తున్నట్లు సమాచారం. బీజేపీ నేతలు సామ్రాట్‌ ఛౌదరీ, విజయ్‌ సిన్హాలు ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. నూతన కేబినెట్‌లో ఐదు నుంచి ఆరు కొత్త ముఖాలు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. జేడీయూ నుంచి ప్రస్తుత మంత్రులే కొనసాగనుండగా.. భాజపాలో మాత్రం కొత్తవారికి చోటు దక్కనున్నట్లు తెలిసింది. వీరితోపాటు ఇతర భాగస్వామ్య పక్షాలకు మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
The post Nitish Kumar: బిహార్‌ ఎన్డీయే శాసనసభాపక్షనేతగా నీతీశ్‌ కుమార్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్

KCR : కాంగ్రెస్‌ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కూడా గడవకుండానే… ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. పల్లెల్లోని రైతులే

CM Revanth Reddy: ప్ర‌పంచ పెట్టుబ‌డిదారుల‌కు ఉత్త‌మ గమ్య‌స్థానం హైద‌రాబాద్‌ – సీఎం రేవంత్CM Revanth Reddy: ప్ర‌పంచ పెట్టుబ‌డిదారుల‌కు ఉత్త‌మ గమ్య‌స్థానం హైద‌రాబాద్‌ – సీఎం రేవంత్

    అంత‌ర్జాతీయ స్థాయి మౌలిక వ‌స‌తులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు అనువైన వాతావ‌ర‌ణం, భ‌ద్ర‌తకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైద‌రాబాద్ ప్ర‌పంచవ్యాప్త పెట్టుబ‌డిదారుల‌కు ఉత్త‌మ గమ్యస్థాన‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే పెద్ద సంఖ్య‌లో యువ‌త‌,

Red Fort: ఉగ్రవాదుల అసలు టార్గెట్ ఎర్రకోట ?Red Fort: ఉగ్రవాదుల అసలు టార్గెట్ ఎర్రకోట ?

    చరిత్రాత్మక ఎర్రకోట వద్ద ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజు పెను విధ్వంసానికి పాల్పడాలని డాక్టర్‌ ముజమ్మిల్‌ గనయీ పదేపదే ప్రయత్నం చేశాడా? అప్పటికే అక్కడ గట్టి బందోబస్తు ఉండటంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయా?.. దీంతో వచ్చే నెల