hyderabadupdates.com Gallery Pakistan: భారత్‌ తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి – పాక్ మంత్రి ఖవాజా

Pakistan: భారత్‌ తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి – పాక్ మంత్రి ఖవాజా

Pakistan: భారత్‌ తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి – పాక్ మంత్రి ఖవాజా post thumbnail image

 
 
 
పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ భారత్‌పై మరోసారి ఉద్రిక్త వాఖ్యలు చేశారు. భారత్ తో యుద్ధం జరిగే అంశాన్ని కొట్టిపారేయలేమని ఒకవేళ పూర్తిస్థాయిలో యుద్ధం వస్తే ఎదుర్కొవడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉండాలన్నారు.
ఇటీవలే భారత ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఆపరేషన్ సిందూర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ కేవలం 88గంటల ట్రైలర్ మాత్రమేనన్నారు. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి భారత ఆర్మీ సిద్ధంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి ఖయ్యానికి కాలు దువ్వారు. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ “నేను భారత్‌ను విస్మిరించడం లేదు అదే విధంగా నమ్మడం లేదు. నాఅంచనా ప్రకారం భారత్ నుంచి సరిహాద్దు చొరబాట్లైనా ఉండవచ్చు. లేదా పూర్తిస్థాయి యుద్ధమైనా జరగవచ్చు దేనికైనా మనం సిద్దంగా ఉండాలి” అని ఆసిఫ్ అన్నారు.
అయితే వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అయిన ఖవాజా గతంలోనూ ఇలానే కూతలు కూశారు. భారత్, ఆప్గాన్ రెండు దేశాలతో ఏక కాలంలో యుద్ధం చేస్తామని ప్రకటించారు. పహాల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఆదేశంలోని టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసంచేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా ఈ నెల 10 ఎర్రకోట కారు బాంబు దాడిలో సైతం పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థ జైష్ మహమ్మద్‌కు సంబంధాలున్నాయని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే.
 
The post Pakistan: భారత్‌ తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి – పాక్ మంత్రి ఖవాజా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Uttar Pradesh: నాగిని చేష్టలతో భర్తను హడలెత్తిస్తున్న భార్య !Uttar Pradesh: నాగిని చేష్టలతో భర్తను హడలెత్తిస్తున్న భార్య !

Uttar Pradesh : సమస్యలపై ప్రజల నుంచి వినతుల స్వీకారానికి నిర్వహించే ‘సమాధాన్‌ దివస్‌’ (ప్రజా ఫిర్యాదుల దినం)లో ఓ వ్యక్తి నుంచి వచ్చిన అర్జీ చూసి యూపీలోని (Uttar Pradesh) సీతాపుర్‌ కలెక్టర్‌ నివ్వెరపోయారు. తన భార్య నసీమున్‌ రాత్రిపూట

Vijay Mallya: బ్యాంకులపై కోర్టుకెక్కిన విజయ్‌ మాల్యVijay Mallya: బ్యాంకులపై కోర్టుకెక్కిన విజయ్‌ మాల్య

    తనకు బ్యాంకులు ఇచ్చిన రుణం కన్నా… ఎక్కువ మొత్తంలో వసూలు చేశాయని విదేశాల్లో తలదాచుకున్న పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్య అభ్యంతరం తెలిపారు. తన నుంచి వసూలు చేసిన అసలు, వడ్డీలకు మరోసారి కొత్తగా వడ్డీ విధిస్తున్నారని ఆరోపిస్తూ కర్ణాటక