మావోయిస్టుల ఆచూకీ విషయంలో ఏపీ హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ఈరోజు (గురువారం) విచారణ జరిగింది. మావోయిస్టు అగ్రనేతలు దేవజీ, మల్లా రాజిరెడ్డిలను కోర్టులో హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. రాజిరెడ్డి కుమార్తె స్నేహ లత, దేవజీ సోదరుడు ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా.. ఈరోజు న్యాయస్థానంలో విచారణ జరిగింది. వారు ఇరువురు తమ వద్ద లేరని హైకోర్టుకు పోలీసులు నివేదించారు. అరెస్ట్ చేసిన మావోయిస్టులను సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చామని వివరణ ఇచ్చారు.
వారు ఇరువురు పోలీసులు వద్ద ఉన్నారనేందుకు ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్టు కీలక నేతలు తమ ఆధీనంలో ఉన్నారని పోలీసులు ప్రెస్ స్టేట్‌మెంట్ ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రెస్ స్టేట్‌మెంట్‌ను కోర్టు ముందు ఉంచుతామని పిటిషనర్ వెల్లడించారు. ఈ క్రమంలో వ్యాజ్యంపై విచారణను హైకోర్టు రేపటి (శుక్రవారాని)కి వాయిదా వేసింది.
దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి మా వద్ద లేరు – హైకోర్టుకు తెలిపిన పోలీసులు
మావోయిస్టులు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన హెబియస్‌కార్పస్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. వారిద్దరూ తమ వద్ద లేరని పోలీసులు ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. అరెస్టు చేసిన ఇతర మావోయిస్టులను సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చినట్లు పేర్కొన్నారు.
దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. మావోయిస్టు కీలక నేతలు తమ ఆధీనంలో ఉన్నారని పోలీసులు ప్రెస్ స్టేట్‌మెంట్ ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రెస్ స్టేట్‌మెంట్‌ను కోర్టు ముందు ఉంచుతామన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లతో భద్రతా బలగాలు పెద్ద విజయం సాధించాయి – ఏపీ డీజీపీ
రాష్ట్రం, దేశంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోందని ఏపీ డీజీపీ (AP DGP) హరీశ్‌కుమార్ గుప్తా అన్నారు. ఇటీవల మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో రంపచోడవరంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. ‘‘మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లతో భద్రతా బలగాలు పెద్ద విజయం సాధించాయి. హిడ్మా మద్వి, టెక్ శంకర్ సహా 13 మంది మావోయిస్టులు మృతిచెందారు. రాష్ట్రంలో 50 మంది వరకు మావోయిస్టులను అరెస్ట్ చేశాం. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా తీర్చదిద్దుతాం. భద్రతా బలగాలు సాధించిన విజయానికి వారిని అభినందిస్తున్నా’’ అని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అన్నారు.
The post AP High Court: మావోయిస్టు అగ్రనేతల ఆచూకీపై హైకోర్టులో పిటిషన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
AP High Court: మావోయిస్టు అగ్రనేతల ఆచూకీపై హైకోర్టులో పిటిషన్
Categories: