hyderabadupdates.com movies స్పిరిట్ షురూ అయ్యింది… సంతోషమే కానీ

స్పిరిట్ షురూ అయ్యింది… సంతోషమే కానీ

టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ కాంబినేషన్స్ లో ఒకటిగా చెప్పుకున్న స్పిరిట్ ఎట్టకేలకు ఏడాది నిరీక్షణ తర్వాత మొదలయ్యింది. యానిమల్ తర్వాత ఏకంగా రెండేళ్ల గ్యాప్ వచ్చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ కోసం చాలా సమయం కేటాయించాడు. ప్రభాస్ డేట్స్ ఇవ్వడం లేటయ్యింది కానీ లేదంటే ఆరు నెలల క్రితమే టెంకాయ కొట్టేది. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఓపెనింగ్ చేశారు. ఫోటోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఆరాధనలో ఐకానిక్ చిరు ఫోజును ఫోటోగా పెట్టుకున్న వంగా దాని ముందే చిరంజీవితో ఫోటో దిగడం ఫ్యాన్స్ కి యమా కిక్ ఇచ్చింది.

ఇక్కడిదాకా అంతా సంతోషమే. ఇక స్పిరిట్ ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురు చూడటమే మిగిలింది. అయితే ఇక్కడ కాస్త ఎక్కువ ఎదురు చూపులు తప్పవు. ఎందుకంటే 2026లో ది రాజా సాబ్, ఫౌజీ రెండూ థియేటర్లకు వచ్చేస్తాయి. అంటే 2027లోనే స్పిరిట్ దర్శనం ఉంటుందన్న మాట. పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం తీసుకునే సందీప్ వంగా ఇప్పటికిప్పుడు రిలీజ్ డేట్ నిర్ణయం తీసుకోలేడు. ఎందుకంటే అల్లు అర్జున్ – అట్లీ మూవీ, మహేష్ బాబు వారణాసిల తేదీలు ముందు తేలాలి. వాటికి అనుగుణంగా క్లాష్ లేకుండా స్పిరిట్ ప్లాన్ చేసుకోవాలి. అందుకే తొందరపడకపోవచ్చు.

సందీప్ వంగా మనసులో మాత్రం 2027 డిసెంబర్ నెలే ఉందట. సరే ఇప్పటికిప్పుడు ఫలానా డేట్ అని ఎవరూ చెప్పలేరు కానీ ప్రభాస్ అభిమానులు కొంత కాలం దీని అప్డేట్స్ గురించి ఎదురు చూడటం కన్నా మిగిలిన వాటి మీద ఫోకస్ పెట్టడం బెటర్. త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తున్న ఈ పోలీస్ యాక్షన్ డ్రామాలో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు హర్షవర్ధన్ రామేశ్వర్ పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముందే సిద్ధం చేసి పెట్టుకున్నారట. ప్రభాస్ పాత్ర మూడు షేడ్స్ లో ఉంటుందట. వాటికి సంబంధించిన ఫోటో షూట్స్ అయిపోయాయని వినికిడి.

Related Post

బాబు ఫిదా: ఔను.. అంద‌రూ ముందుకొచ్చారుబాబు ఫిదా: ఔను.. అంద‌రూ ముందుకొచ్చారు

ఏపీ సీఎం చంద్ర‌బాబు తొలిసారి ఫిదా అయ్యారు. అది కూడా ఆయ‌న ఇటీవ‌ల కాలంలో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న రెండు విష‌యాల‌పై సంతోషం వ్యక్తం చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అంతేకాదు, అంద‌రూ చంద్ర‌బాబుతో స‌హా హ‌ర్షం వ్య‌క్తం