hyderabadupdates.com movies చిరు లేడు కానీ… చిరు వచ్చాడు

చిరు లేడు కానీ… చిరు వచ్చాడు

గత మూడు దశాబ్దాల్లో తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చిన ప్రతి దర్శకుడూ ఒక్క సినిమా అయినా చేయాలని ఆశపడ్డ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరసలో ఉంటాడనడంలో సందేహం లేదు. ఎంతోమంది దర్శకులకు సినిమా పిచ్చి ఎక్కించడంలో చిరు ప్రధాన పాత్ర పోషించి ఉంటాడనంలో సందేహం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. స్వయంకృషి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి దిగ్గజాలను మించి ఎదగడం అంటే ఆషామాషీ విషయం కాదు. 

అందుకే ఆయన ఎందరికో స్ఫూర్తి. ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా వెలుగొందుతున్న ప్రతి ఒక్కరూ చిరు పేరు చెబితే ఎక్కడ లేని ఎమోషన్ తెచ్చుకుంటారు. ఆయన గురించి గొప్పగా మాట్లాడతారు. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో ఒకడైన సందీప్ రెడ్డి వంగకు కూడా చిరు అంటే పిచ్చి అభిమానం అన్న సంగతి తెలిసిందే. చిరు ఫెరోషియస్‌ లుక్‌తో ఉన్న ఒక ఫొటోను తన ఆఫీసులో పెట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించాడు సందీప్.

అంతటి అభిమానం ఉన్న సందీప్.. చిరుతో ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఊహ మెగా అభిమానులను ఎంతో ఎగ్జైట్ చేస్తోంది. ప్రభాస్‌తో అతను చేయబోయే ‘స్పిరిట్’లో చిరు ప్రత్యేక పాత్ర చేస్తాడన్న ఒక రూమర్ కొన్ని రోజులు సోషల్ మీడియాను ఊపేసింది. కానీ ఆ వార్త నిజం కాదని తేల్చేశాడు సందీప్. ఐతే ‘స్పిరిట్’ సినిమాలో నటించకపోయినా.. ఆ సినిమా ముహూర్త వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై.. టీంను ఆశీర్వదించాడు చిరు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ వేడుక ఆదివారం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన చిరు.. క్లాప్ కొట్టి సినిమాను మొదలుపెట్టించారు. 

ఈ వేడుకలో నిర్మాతలు భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగలతో పాటు హీరోయిన్ త్రిప్తి డిమ్రి కూడా హాజరైంది. చిరు కోసమేనేమో ఈ వేడుకను హైదరాబాద్‌లో చేసినట్లున్నారు. భూషణ్ కుమార్, త్రిప్తి సహా టీంలోని పలువురు ముంబయి నుంచి ఇక్కడికి వచ్చారు. ఐతే లుక్ రెవీల్ అవ్వకూడదనే ఉద్దేశంతో ప్రభాస్ ఫొటోస్ మాత్రం రిలీజ్ చెయ్యలేదు సందీప్. ముహూర్త వేడుకతోనే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలైపోవడం విశేషం. బ్యాగ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ రెడీ చేసి ప్రి ప్రొడక్షన్ పనులనూ పక్కాగా పూర్తి చేసిన సందీప్.. శరవేగంగా చిత్రీకరణ సాగించాలని చూస్తున్నాడు.

Related Post

ప్రభాస్ కోసం హను ‘మహాభారత’ వ్యూహం!ప్రభాస్ కోసం హను ‘మహాభారత’ వ్యూహం!

​ప్రభాస్ పుట్టినరోజుకు చాలా అప్‌డేట్స్ వస్తున్నా, హను రాఘవపూడి ఫౌజీ సినిమాకు సంబంధించి వచ్చిన ఒకే ఒక్క శ్లోకం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది కేవలం ఒక సినిమా అప్‌డేట్ కాదు, ప్రభాస్ పోషించబోయే పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా

ప్లానింగ్ మార్చుకున్న పెద్ది పాటప్లానింగ్ మార్చుకున్న పెద్ది పాట

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న పెద్ది నుంచి ఫస్ట్ ఆడియో సింగల్ దసరా మిస్ చేసుకున్నా దీపావళికి రావొచ్చని ఫ్యాన్స్ ఎదురు చూశారు. దీని కోసమే మన శంకరవరప్రసాద్ గారు మీసాల పిల్లని సందర్భం లేకపోయినా