hyderabadupdates.com movies రాజుగారు సౌండ్ చేయడం లేదెందుకు

రాజుగారు సౌండ్ చేయడం లేదెందుకు

ఎంత పోటీ ఉన్నా సరే సంక్రాంతికి వచ్చే తీరతాం అని శపధం చేసిన సినిమాల్లో అనగనగా ఒక రాజు ఉంది. నవీన్ పోలిశెట్టి హీరోగా మారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ జనవరి 14 డేట్ ఎప్పుడో వేసుకుంది. దానికి తగ్గట్టే పండగలకు పబ్బాలకు నవీన్ వీడియో కంటెంట్ రూపంలో ఏదో ఒక హడావిడి చేస్తూనే వచ్చాడు. అవి రీచ్ అయ్యాయి కూడా. కానీ ఉన్నట్టుండి దీపావళి తర్వాత హఠాత్తుగా సైలెంట్ అయిపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎందుకంటే అనగనగా ఒక రాజు నుంచి ఇప్పటిదాకా ఒక్క లిరికల్ సాంగ్ రిలీజ్ కాలేదు. మిక్కీ జె మేయర్ పాటలైతే ఇచ్చాడు కానీ ఎందుకో ఆలస్యం చేస్తున్నారు.

ఇన్ సైడ్ టాక్ అయితే మరోలా ఉంది. షూటింగ్ ఇంకో ముప్పై రోజుల దాకా ఉందట. ఇది నిజమైతే వర్క్ చాలా టైట్ అయిపోతుంది. లేనిపోని ఒత్తిడితో సతమతమవ్వాల్సి ఉంటుంది. కానీ నిర్మాత నాగవంశీ ఈ మధ్య అందుబాటులోకి రావడం లేదు. విజయ్ జన నాయకుడు హక్కులు కొంటారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏదైనా అడుగుదామంటే దొరికే ఛాన్స్ లేదు. మాస్ జాతర రిజల్ట్ తర్వాత బొత్తిగా దర్శనం లేదు. అఖండ 2 ప్రొడ్యూసర్లతో ఇంటర్వ్యూ చేయడం ద్వారా వీడియోలో కనిపించారు కానీ డైరెక్ట్ కాంటాక్ట్ నో. సో రాజుగారు గురించి క్లారిటీ రావాలంటే ఇంకొద్దిరోజులు ఆగాల్సి వచ్చేలా ఉంది.

అనుమానం లేకుండా రాజా సాబ్ జనవరి 9 రావడం ఫిక్స్ అయిపోయింది. మన శంకవవరప్రసాద్ గారుని ఎట్టి పరిస్థితుల్లో అనిల్ రావిపూడి పండగకు దించడం ఖాయం. భర్త మహాశయులకు విజ్ఞప్తి సైతం కాంపిటీషన్ కు సై అంటోంది. డబ్బింగ్ బొమ్మలు జన నాయకుడు, పరాశక్తికి సంబంధించిన తెలుగు బయ్యర్లు త్వరలో ఫైనల్ కాబోతున్నారు. నారి నారి నడుమ మురారి రావడం డౌటేనని ఇన్ సైడ్ టాక్. కానీ టీమ్ మాత్రం తగ్గేదేలే అంటోంది. ఇక అనగనగా ఒక రాజు అప్పుడప్పుడు సౌండ్ చేస్తే బెటర్. ఒకవేళ వాయిదా పడిందంటే మాత్రం జనవరి చివరి వారంలో రిపబ్లిక్ డే సందర్భంగా రావాల్సి ఉంటుంది.

Related Post

Prabhas Unveils ‘Shambhala’ Trailer: Aadi Sai Kumar Leads a Gripping Supernatural ThrillerPrabhas Unveils ‘Shambhala’ Trailer: Aadi Sai Kumar Leads a Gripping Supernatural Thriller

Rebel Star Prabhas has unveiled the trailer of Shambhala: A Mystical World, starring Aadi Sai Kumar, setting social media abuzz with excitement. His support has instantly brought massive attention to

అంబ‌టి రాంబాబుపై కేసులు.. ఈసారి అరెస్టేనా?అంబ‌టి రాంబాబుపై కేసులు.. ఈసారి అరెస్టేనా?

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుపై గుంటూరుజిల్లా ప‌ట్టాభిపురం పోలీసులు కేసులు న‌మోదు చేశారు. అయితే.. గ‌తంలోనూప‌లు కేసులు న‌మోదైనా.. వాటిలో అరెస్టు చేసే అవ‌కాశం త‌క్కువ‌గా ఉండ‌డంతో పోలీసులు కేవ‌లం నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. ఈ నేప‌థ్యంలో