hyderabadupdates.com Gallery Celina Jaitly: యూఏఈ జైల్లో ఉన్న సోదరుడు కోసం బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ రిక్వెస్ట్

Celina Jaitly: యూఏఈ జైల్లో ఉన్న సోదరుడు కోసం బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ రిక్వెస్ట్

Celina Jaitly: యూఏఈ జైల్లో ఉన్న సోదరుడు కోసం బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ రిక్వెస్ట్ post thumbnail image

Celina Jaitly : యూఏఈ జైల్లో ఉన్న తన సోదరుడిని విడిపించమంటూ బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ (Celina Jaitly) భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ కన్నీటి పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘నా సోదరుడు మేజర్ విక్రాంత్ జైట్లీని యూఏఈ జైల్లో పెట్టి సంవత్సరం పైనే అవుతోంది. మొదటి సారి విక్రాంత్‌ను అదుపులోకి తీసుకున్నపుడు 8 నెలల పాటు ఎవరితోనూ టచ్‌లో లేకుండా నిర్బంధంలో ఉంచారు. తర్వాత మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఎక్కడో ఉంచారు. నేను భయంతో అల్లాడిపోతున్నాను. అతడి స్వరం వినడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను. అతడి ముఖం చూడ్డానికి పరితపిస్తున్నాను.
Celina Jaitly Requests
విక్రాంత్‌ను ఏం చేశారోనని భయంగా ఉంది. ఆర్మీలో పని చేసినపుడు అతడు ఎన్నో గాయాలపాలయ్యాడు. తన యవ్వనాన్ని, శక్తిని, బుద్ధిని, ఆఖరికి తన జీవితాన్ని కూడా భారత దేశం కోసం త్యాగం చేశాడు. మన జెండా కోసం రక్తం చిందించాడు. అన్నా.. నిన్ను వెతకటం కోసం అన్నిటినీ పోగొట్టుకున్నాను. నేను ఈ పోరాటాన్ని ఆపను. నిన్ను ఈ భారత గడ్డపైకి తీసుకువచ్చే వరకు నా పోరాటం ఆపను. కాళికా మాతాకీ జై..’ అంటూ ఎమోషనల్ అయ్యింది.
సెలెనా అన్న విక్రాంత్ ఆర్మీలో మేజర్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. ఓ కేసులో ఆయనను యూఏఈ అదుపులోకి తీసుకుంది. 2024 నుంచి యూఏఈలోని జైల్లోనే ఉన్నారు. కానీ, ఆయన్ను ఎక్కడ ఉంచారన్నది తెలియరాలేదు. సెలెనా తన సోదరుడి కోసం గతంలో ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. సెలెనాకు సాయం చేయాలని విదేశీ వ్యవహారాల శాఖను కోర్టు ఆదేశించింది. అన్ని రకాలుగా విదేశీ వ్యవహారాల శాఖ సాయం చేసినా కూడా లాభం లేకుండా పోయింది.
Also Read : Russia: భారత్‌ కు రష్యా బంపర్ ఆఫర్‌
The post Celina Jaitly: యూఏఈ జైల్లో ఉన్న సోదరుడు కోసం బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ రిక్వెస్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Saudi Arabia: సౌదీ బస్సు ప్రమాదం ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి జైశంకర్Saudi Arabia: సౌదీ బస్సు ప్రమాదం ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి జైశంకర్

  యాత్రికులతో వెళ్తోన్న బస్సును డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 42 మంది సజీవ దహనం కాగా వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నారు. ఈ

Mahabubabad: కోర్టు ధిక్కారం కేసులో ఆర్డీవో కార్యాలయం జప్తుMahabubabad: కోర్టు ధిక్కారం కేసులో ఆర్డీవో కార్యాలయం జప్తు

    న్యాయస్థానం తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలని మహబూబాబాద్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దాంతో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు ఆర్డీవో కార్యాలయంలో సామగ్రిని జప్తు చేసిన ఘటన

Kiran Abbavaram’s Comedy Entertainer ‘K-Ramp’ Trailer Goes ViralKiran Abbavaram’s Comedy Entertainer ‘K-Ramp’ Trailer Goes Viral

Young Telugu actor Kiran Abbavaram is all set to charm audiences with his latest film, K-Ramp. The trailer for the full-fledged comedy entertainer was recently released and has received an