hyderabadupdates.com Gallery CM Revanth Reddy: అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా కొడంగల్‌ – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా కొడంగల్‌ – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా కొడంగల్‌ – సీఎం రేవంత్‌రెడ్డి post thumbnail image

CM Revanth Reddy : కొడంగల్‌లో ఏ విద్యార్థీ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 28 వేల మందికి ఉదయం అల్పాహారం అందిస్తున్నామన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో 5 వేల మంది విద్యార్థులు పెరిగారని చెప్పారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ పర్యటనకు వెళ్లిన రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy).. అక్కడి అక్షయపాత్ర ఫౌండేషన్‌ కిచెన్‌ను పరిశీలించారు. మిడ్‌డే మీల్స్‌ కిచెన్‌ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
CM Revanth Reddy Important Comments
‘‘జీవితాల్లో మార్పు రావాలంటే పిల్లల్ని చదివించాలి. కొడంగల్‌లో రూ.5వేల కోట్లతో ఎడ్యుకేషన్‌ క్యాంపస్‌ నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో తొలి సైనిక్‌ స్కూల్‌ను ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నాం. 16 నెలల్లోగా కొడంగల్‌ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా తయారు చేస్తాం. మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. వెయ్యి ఆర్టీసీ బస్సులకు వారిని యజమానులుగా చేశాం. సోలార్‌ పవర్‌ ప్లాంట్లు, పెట్రోల్‌ బంకులకు కూడా యజమానులను చేశాం. అదానీ, అంబానీలతో పోటీపడేలా వారిని ప్రోత్సహిస్తున్నాం. మహిళా సంఘాల ఉత్పత్తులు అమెజాన్‌లో అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
మూడు నెలల్లో కొడంగల్‌లోని ప్రతి గ్రామానికి కృష్ణా నీళ్లు అందిస్తాం. లగచర్ల పారిశ్రామికవాడకు అంతర్జాతీయస్థాయి గుర్తింపు తీసుకొస్తాం. తెలంగాణ నోయిడాగా కొడంగల్‌ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాం. రాబోయే కొన్ని నెలల్లో కొడంగల్‌ రైల్వే పనులు ప్రారంభమవుతాయి. నియోజకవర్గంలో సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలో సర్పంచ్‌ ఎన్నికలు రాబోతున్నాయి. 3, 4 రోజుల్లో సర్పంచ్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. అభివృద్ధికి మద్దతుగా ఉండేవారిని సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలి’’ అని రేవంత్‌ పిలుపునిచ్చారు.
Also Read : Celina Jaitly: యూఏఈ జైల్లో ఉన్న సోదరుడు కోసం బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ రిక్వెస్ట్
The post CM Revanth Reddy: అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా కొడంగల్‌ – సీఎం రేవంత్‌రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Prashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసుPrashant Kishore: ప్రశాంత్ కిశోర్‌పై కోడ్ ఉల్లంఘన కేసు

    ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పై వైశాలి జిల్లాలోని రఘోపూర్ లో కేసు నమోదైంది. రఘోపూర్ ప్రాంతంలో ప్రశాంత్ కిషోర్ శనివారంనాడు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనంతరం ఆయనపై

Anil Sahani: బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేతAnil Sahani: బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత

Anil Sahani : అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీహార్‌ లో నేతల జంప్‌ జిలానీ వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆర్జేడీ నేత అనిల్‌ సహానీ (Anil Sahani) బుధవారం బీజేపీలో చేరారు. విశేషం ఏమిటంటే

CM Revanth Reddy: ఒక్క అవకాశం ఇవ్వండి – జూబ్లీహిల్స్‌ రోడ్‌ షో లో సీఎం రేవంత్‌రెడ్డిCM Revanth Reddy: ఒక్క అవకాశం ఇవ్వండి – జూబ్లీహిల్స్‌ రోడ్‌ షో లో సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు పెద్దపీట వేస్తున్న ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు