hyderabadupdates.com Gallery Mohan Bhagwat: సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక – మోహన్ భాగవత్

Mohan Bhagwat: సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక – మోహన్ భాగవత్

Mohan Bhagwat: సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక – మోహన్ భాగవత్ post thumbnail image

 
 
రామాలయ నిర్మాణం కోసం ఎందరో త్యాగాలు చేశారని, వారి ఆత్మలు ఈరోజు సంతోషంగా ఉంటాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అయోధ్యలో బాలరాముడి ఆలయ శిఖరంపై ప్రధానమంత్రి మోదీతో కలిసి కాషాయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ఈరోజు ఎంతో శుభదినమని, ఈ క్షణాల కోసం, రామాలయ నిర్మాణం కోసం ఎందరో త్యాగాలు చేశారని, వారి ఆత్మలకు నేటితో శాంతి చేకూరిందని అన్నారు.
‘మహంత్ రాజచంద్ర దాస్‌ మహరాజ్, దాల్మియా (వీహెచ్‌పీ సీనియర్ నేత), అశోక్ (అశోక్ సింఘాల్) సహా అనేక మంది సాధువులు, విద్యార్థులు, అన్నిరంగాలకు చెందిన ప్రజలు ప్రాణత్యాగాలు చేశారు. ఆలయ నిర్మాణం కోసం వారు కన్న కలలు నేటికి ఫలించాయి’ అని మోహన్ భాగవత్ అన్నారు. ఈరోజుతో ఆలయ శాస్త్రీయ ప్రక్రియ పూర్తయిందని, ధ్వజారోహణ నిర్వహించుకున్నామని పేర్కొన్నారు.
 
500 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది
 
రామాలయ నిర్మాణం కోసం 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కాషాయ జెండా, భగవధ్వజం, ధర్మధ్వజం ఈరోజు ఆలయ శిఖరంపై ఆవిష్కృతమైందని మోహన్ భాగవత్ అన్నారు. హిందువులు తమ సత్వగుణాన్ని 500 ఏళ్లుగా చాటుకుంటూ వచ్చారని, ఎట్టకేలకు రామ్‌లల్లా మందిర నిర్మాణం జరిగి బాలరాముడు మన కళ్లముందు ఉన్నారని అన్నారు. సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక అని పేర్కొన్నారు. మన పూర్వీకులు మనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఇదని అన్నారు. ఈదేశంలో పుట్టిన వారంతా మన పెద్దసోదరులని, ఎన్నో అంచనాలతో ప్రపంచం మనవైపు చూస్తోందని, వాటిని సాకారం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. రామాలయ శిఖరంపై ధ్వజారోహణ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.
The post Mohan Bhagwat: సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక – మోహన్ భాగవత్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Sudarshan Reddy: మంత్రి అనుకుంటే సలహాదారు ఇచ్చారు – సుదర్శన్ రెడ్డిSudarshan Reddy: మంత్రి అనుకుంటే సలహాదారు ఇచ్చారు – సుదర్శన్ రెడ్డి

    తాను మంత్రి ప‌ద‌వి ఆశించిన మాట వాస్త‌మేన‌ని తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. కొన్ని స‌మీక‌ర‌ణాల వ‌ల్ల త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేద‌ని చెప్పారు. సెక్రటేరియట్‌లో బుధ‌వారం ఉద‌యం ప్రభుత్వ సలహాదారుగా ఆయ‌న

Fake Liquor Case: నకిలీ మద్యం కేసు కీలక సూత్ర దారి జోగి రమేష్Fake Liquor Case: నకిలీ మద్యం కేసు కీలక సూత్ర దారి జోగి రమేష్

    నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్‌రావు సంచలన విషయాలు బయటపెట్టాడు. వైసీపీ పాలనలో జోగి రమేశ్‌ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందని పేర్కొన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో తయారీ ఆపేసినట్లు వివరించాడు. ‘‘ఏప్రిల్‌లో

Chirag Paswan: బిహార్‌ లో ఎన్డీయేకు తప్పని చిరాగ్ చికాకు ?Chirag Paswan: బిహార్‌ లో ఎన్డీయేకు తప్పని చిరాగ్ చికాకు ?

Chirag Paswan : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో ప్రస్తుతం అన్ని పార్టీలు సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి. అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి పక్షాలు తమ భాగస్వామ్య పార్టీలతో పొత్తులను తేల్చుకునే చర్చలను ముమ్మరం చేశాయి. ఎన్డీయే