hyderabadupdates.com Gallery CM Nitish Kumar: కోటి ఉద్యోగాల కల్పనకు నితీశ్ క్యాబినెట్ నిర్ణయం

CM Nitish Kumar: కోటి ఉద్యోగాల కల్పనకు నితీశ్ క్యాబినెట్ నిర్ణయం

CM Nitish Kumar: కోటి ఉద్యోగాల కల్పనకు నితీశ్ క్యాబినెట్ నిర్ణయం post thumbnail image

 
 
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం అనంతరం నితీశ్ కుమార్ మంత్రివర్గం మంగళవారంనాడు తొలిసారి సమావేశమైంది. నితీశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర యువతకు కోటి ఉద్యోగాలు కల్పించాలని, ‘ఈస్ట్రన్ ఇండియా టెక్ హబ్’గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. సమావేశానంతరం బిహార్ చీఫ్ సెక్రటరీ ప్రత్యయ్ అమ్రిత్ ఆ వివరాలను మీడియాకు తెలిపారు. విస్తృత ఉద్యోగావకాశాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధిపై సమావేశంలో కీలకంగా చర్చ జరిగినట్టు ఆయన చెప్పారు.
 
డిఫెన్స్ కారిడార్, సెమీకండక్టర్ తయారీ పార్క్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, మెగా టెక్ సిటీ, ఫిట్‌నెస్ సిటీ ఏర్పాటుతో బీహార్‌ను ఈస్ట్రన్ ఇండియా టెక్ హబ్‌గా తయారు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు సీఎస్ తెలిపారు. న్యూఏజ్ ఎకానమీ కింద రాబోయే ఐదేళ్లలో గ్లోబల్ వర్క్‌ప్లేస్‌గా బీహార్‌ను అభివృద్ధి చేయనున్నామని, ఈ లక్ష్య సాధనకు డెడికేటెడ్ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్టార్టప్ డొమైన్‌లో రాష్ట్రంలోని ప్రతిభావంతులు, యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు రూపొందించేందుకు ఒక కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశామని తెలిపారు. ఏఐ డొమైన్‌లో కూడా బీహార్‌ను లీడింగ్ స్టేట్‌గా తీర్చిదిద్దనున్నామని, ఇందుకు అవసరమైన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మిషన్‌కు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సీఎస్ తెలిపారు.
సోనెపూర్, సీతామర్హితో సహా 12 సిటీల్లో గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మూతపడిన 9 చక్కెర మిల్లులను పునరుద్ధరించాలని, 25 కొత్త మిల్లలను ఏర్పాటు చేయాలని కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చీఫ్ సెక్రటరీ వివరించారు.
The post CM Nitish Kumar: కోటి ఉద్యోగాల కల్పనకు నితీశ్ క్యాబినెట్ నిర్ణయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తెలంగాణ ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి రేసులో జ‌యేష్ రంజ‌న్తెలంగాణ ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి రేసులో జ‌యేష్ రంజ‌న్

హైద‌రాబాద్ : గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో చ‌క్రం తిప్పిన సీనియ‌ర్ ఐఏఎస్ జ‌యేష్ రంజ‌న్ ప్ర‌స్తుతం కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ లో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. తాజాగా జ‌యేష్ రంజ‌న్ సంచ‌ల‌నంగా మారారు. త‌ను ప్ర‌స్తుతం తెలంగాణ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ చొరవతో ‘గూడెం’కు విద్యుత్ వెలుగులుPawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ చొరవతో ‘గూడెం’కు విద్యుత్ వెలుగులు

    అంతరిక్షంలో అడుగుపెట్టిన ఆధునిక యుగంలోనూ… విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉన్న ‘గూడెం’ గ్రామం తొలిసారి విద్యుత్ కాంతులతో మెరిసింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చొరవతో కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారుల కృషితో

అన్ని వ‌ర్గాల‌కు మేలు చేకూర్చిన బ‌డ్జెట్అన్ని వ‌ర్గాల‌కు మేలు చేకూర్చిన బ‌డ్జెట్

అమ‌రావ‌తి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ పార్ల‌మెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కేంద్ర బ‌డ్జెట్ 2026-2027 ను ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్భంగా లోకేష్