hyderabadupdates.com Gallery Delhi Bomb Blasts: డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Delhi Bomb Blasts: డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Delhi Bomb Blasts: డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు post thumbnail image

 
 
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నవంబర్ 10వ తేదీన కారు బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఉమర్ ఉన్ నబీ అనే డాక్టర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దర్యాప్తు అధికారులు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన టెర్రరిస్టులను విచారించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 2016లో భద్రతా దళాల కాల్పుల్లో టెర్రరిస్ట్ బుర్హాన్ వాణి చనిపోయాడు. అతడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఉమర్ భావించినట్లు సమాచారం. అతడు ఆత్మాహుతి దాడికి పాల్పడటానికి ఇది కూడా ఓ కారణంగా తెలుస్తోంది.
 
ఫరీదాబాద్ అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన టెర్రిరిస్ట్ డాక్టర్ ముజమిల్ షకీల్.. ఉమర్‌‌కు ‘ఎమిర్’ అన్న బిరుదు ఇచ్చాడు. ఇక, అప్పటినుంచి ఉమర్ తనను తాను మిగిలిన టెర్రరిస్టులకు ఓ పరిపాలకుడిగా.. నాయకుడిగా.. యువరాజుగా చెప్పుకునే వాడని సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న షాహీన్ సాయీద్ కూడా దర్యాప్తు అధికారులకు కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ముజమిల్ షకీల్‌ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు.
ఉమర్‌కు తమ గ్రూపులో మంచి గౌరవం ఉందని, అతడి అనుభవం కూడా ఎక్కువేనని ముజమిల్ చెప్పినట్లు సమాచారం. ఉమర్‌తో పోల్చుకుంటే తాను ఓ సాధారణ కూలీలాంటి వాడినని ముజమిల్ చెప్పాడట. ‘ఆపరేషన్ ఎమిర్’ పేరుతోటే ఆత్మాహుతి దాడికి వ్యూహ రచన జరిగినట్లు ముజమిల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ముజమిల్ చెబుతున్న దాని ప్రకారం.. ఉమర్‌కు 9 భాషలు తెలుసు. టెర్రరిస్టుల గ్రూపులో అతడే తెలివైన వాడు. చనిపోయే వరకు తను మతం కోసమే ఇదంతా చేస్తున్నట్లు భావించేవాడు.
The post Delhi Bomb Blasts: డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా 

Palla Srinivasarao : విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి తాను కూర్చున్న స్టేజి కూలిపోయిన ఘటన వెనుక ప్రభుత్వం యొక్క కుట్ర దాగి ఉందని శాసన మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే

బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌ ఎప్పుడంటే!బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌ ఎప్పుడంటే!

టాలీవుడ్‌లో యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం “బ్యాడ్ బాయ్ కార్తీక్” నుంచి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ చూసిన వెంటనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి పెరిగింది. ఇందులో నాగశౌర్య స్టైలిష్ లుక్‌తో, ఎనర్జీతో కనిపించి ఆకట్టుకున్నాడు. అతని బాడీ