hyderabadupdates.com movies ‘చిరు కంటే విజయ్ గొప్ప డ్యాన్సరా?’ – కీర్తి సరైన సమాధానం

‘చిరు కంటే విజయ్ గొప్ప డ్యాన్సరా?’ – కీర్తి సరైన సమాధానం

సెలబ్రిటీలు పలు సందర్భాల్లో కొన్ని విషయాల్లో తమ అభిప్రాయాలు చెబుతారు. వాటికి ఒక్కోసారి అర్థం వేరేలా బయటికి వెళ్ళిపోయి వివాదాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. గతంలో కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి కన్నా విజయ్ మంచి డాన్సర్ అని అర్థం వచ్చేలా స్టేట్ మెంట్ ఇచ్చిందనే ప్రస్తావన ఇవాళ రివాల్వర్ రీటా ప్రెస్ మీట్ లో వచ్చింది. నిజానికి కీర్తి అప్పట్లో చెప్పిన మాటల ఉద్దేశం వేరే ఉండొచ్చు. తనకు ఊహ తెలిశాక విజయ్ సినిమాలు చూస్తూ పెరిగింది, అందులోనూ చెన్నై బ్యాక్ డ్రాప్ కాబట్టి సహజంగానే విజయ్, అజిత్, ధనుష్ లాంటి వాళ్ళను ఇష్టపడటం సహజం. అంతే తప్ప వేరే రీజన్ ఉండకపోవచ్చు.

నిజానికా ఇంటర్వ్యూ అందరూ మర్చిపోయారు. ఇవాళ దాన్ని గుర్తు చేయడం పట్ల మెగా ఫ్యాన్స్ ని కవ్వించినట్టు అయ్యింది. కీర్తి సురేష్ చాలా హుందాగా ఒకవేళ మీరు నిజంగా అపార్థం చేసుకుని ఉంటే సారీ అని కూడా చెప్పింది. అసలు క్వశ్చన్ అడిగిన కోణమే సరిగా లేదు. అక్కడితో ఆగకుండా అదే ఇష్యూని మళ్ళీ మళ్ళీ అడగడంలో ఉద్దేశం వైరల్ కావడం కోసమో మరింకేదైనా ఉందో అంతు చిక్కడం లేదు. ఇంకో లాజిక్ మర్చిపోకూడదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ మొదలైనవాళ్ళలో ఎవరు బెస్ట్ డాన్సర్ చెప్పమంటే ఆయా అభిమానులు తమ హీరోనే అంటారు. అలాని మిగిలినవాళ్లకు డాన్స్ రాదని అర్థం కాదు.

కాకిపిల్ల కాకికి ముద్దు. మనకు ఇష్టమైన హీరో ఏం చేసినా మనకు బెస్ట్ అనిపిస్తుంది. అంత మాత్రాన అవతలి వాళ్ళను తక్కువ చేసినట్టు కాదు. చిరంజీవి డాన్స్ గురించి కొత్తగా ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. సాక్ష్యాత్తు అక్కినేని నాగేశ్వరరావు గారే చిరంజీవి నృత్యం చేస్తుంటే పక్కన ఎవరు ఉన్నా చూడబుద్ది కాదు అని పబ్లిక్ స్టేజి మీద అన్నారు. అంతకన్నా కితాబు ఏం కావాలి. కీర్తి సురేష్ అన్నా అనకపోయినా వీటిని ఎవరూ మార్చలేరు. ఇక్కడ ఆవిడ అభిప్రాయాన్ని ఖచ్చితంగా గౌరవించాల్సిందే. అంతే తప్ప మీరు ఆ రోజు అలా అడిగారు కదా తప్పు కదా అని పదే పదే రిపీట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏం ఉండదు.

Related Post

విశాల్.. దీన్నయినా బయటికి తెస్తాడా?విశాల్.. దీన్నయినా బయటికి తెస్తాడా?

ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సహవాసం చేయడం తెలుగు వాడైన తమిళ హీరో విశాల్‌కు అలవాటే. అతను నడిగర్ సంఘంలోకి అడుగు పెట్టిన దగ్గర్నుంచే అందులో ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇక తనతో పని చేసే నిర్మాతలు, దర్శకులతో గొడవలు

బీఆర్ ఎస్ అందుకే ఓడిపోయింది: రేవంత్‌రెడ్డి విప్పిన గుట్టు…!బీఆర్ ఎస్ అందుకే ఓడిపోయింది: రేవంత్‌రెడ్డి విప్పిన గుట్టు…!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న కామెంట్లు చేశారు. 2023లో బీఆర్ ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింద‌న్న విషయం ఇప్ప‌టికీ స‌స్పెన్సుగానే ఉంది. “అరె..మేం ఏం త‌క్కువ చేసినం. అయినా ఎందుకు ఓడ‌గొట్టారు?“ అని మాజీ సీఎం, బీఆర్ ఎస్