hyderabadupdates.com movies సోషల్ మీడియాపై సుప్రీమ్ కోర్టు సంచనల నిర్ణయం

సోషల్ మీడియాపై సుప్రీమ్ కోర్టు సంచనల నిర్ణయం

యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఏది పడితే అది మాట్లాడతాం, ఏ వీడియో పడితే అది అప్‌లోడ్ చేస్తాం అంటే ఇక కుదరదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్‌పై ఒక కన్నేసి ఉంచేందుకు కొత్త చట్టాలు రాబోతున్నాయి. యూజర్ జనరేటెడ్ కంటెంట్‌పై నియంత్రణ లేకపోవడంతో జరుగుతున్న అనర్థాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. “ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే” అంటూ కేంద్రానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. 4 వారాల్లోగా దీనికి సంబంధించిన రెగ్యులేషన్స్ తేవాలని ఆదేశించింది.

సమయ్ రైనా, రణ్‌వీర్ అల్లాబాడియా లాంటి యూట్యూబర్స్ చేసిన షోలు (‘India’s Got Latent’) వివాదాస్పదమవ్వడంతో ఈ చర్చ మొదలైంది. కోర్టులో వాదనల సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఇది కేవలం అశ్లీలత మాత్రమే కాదు, వికృత ప్రవర్తన కూడా అని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది చూపించలేమని కోర్టు అభిప్రాయపడింది. యాంటీ నేషనల్ కంటెంట్, వికలాంగులను కించపరిచే వీడియోలు వైరల్ అవుతుంటే చూస్తూ ఊరుకోలేమని జడ్జీలు స్పష్టం చేశారు.

ముఖ్యంగా సమయ్ రైనా ఇష్యూలో.. వికలాంగులను కించపరిచినందుకు అతను డబ్బులు ఇస్తే సరిపోదు, వాళ్లకు కావాల్సింది గౌరవం అని కోర్టు చెప్పింది. ఎస్సీ/ఎస్టీ చట్టం లాగే వికలాంగులను అవమానిస్తే కఠిన శిక్షలు ఉండేలా చట్టం ఎందుకు తేకూడదు అని కేంద్రాన్ని ప్రశ్నించింది. హ్యూమర్ పేరుతో ఒకరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదని తేల్చి చెప్పింది. రైనా తన ప్లాట్‌ఫామ్ ద్వారా వారి విజయాలను చూపిస్తూ షో చేయాలని సూచించింది.

ఈ కంటెంట్‌ను నియంత్రించడానికి ఒక ‘అటానమస్ బాడీ’ ఉండాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. ఇందులో న్యాయమూర్తులు, మీడియా నిపుణులు ఉండొచ్చని సూచించింది. ఏదైనా వీడియో చూసే ముందు కేవలం డిస్క్లైమర్ ఉంటే సరిపోదని, అవసరమైతే ఆధార్ కార్డు ద్వారా వయసు నిర్ధారణ చేసుకునే టెక్నాలజీ కూడా ఉండాలని అభిప్రాయపడింది.

మొత్తానికి, ఇంటర్నెట్‌లో ఫ్రీడమ్ పేరుతో చెలరేగిపోతున్న కంటెంట్ క్రియేటర్లకు సుప్రీంకోర్టు బ్రేకులు వేయబోతోంది. బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని కోర్టు స్పష్టం చేసింది. ఇకపై సోషల్ మీడియాలో వీడియో పెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి రాబోతోంది.

Related Post

82 వేల కోట్లు పెట్టబోతున్న భారీ కంపెనీ.. సస్పెన్స్ కు తెరతీసిన లోకేష్82 వేల కోట్లు పెట్టబోతున్న భారీ కంపెనీ.. సస్పెన్స్ కు తెరతీసిన లోకేష్

రేపు ఉదయం భారీ ప్రకటన అంటూ నిన్న ట్వీట్ చేసి సస్పెన్స్ క్రియేట్ చేసిన లోకేష్.. దానిని రివీల్ చేశారు. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ కంపెనీ పేరును ప్రకటించారు. 2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఆ కంపెనీ… రేపు