hyderabadupdates.com movies పవన్ వి పిచ్చిమాటలు అంటున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి

పవన్ వి పిచ్చిమాటలు అంటున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి

గోదావరి జిల్లాల పచ్చదనం వల్లనే రాష్ట్రం విడిపోయిందేమో అనిపిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవ్వుతూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నాయకుల దిష్టి తగిలి గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని పవన్ చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం కోనసీమలో తలలు లేని మొండెం మాదిరి కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయని పవన్ అన్నారు. ఈ క్రమంలోనే పవన్ కామెంట్లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలోనే పవన్ పై ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు.

పవన్ కళ్యాణ్‌వి తెలివితక్కువ మాటలని, మైండ్ లెస్ అని జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దిష్టి వాళ్ళకి తాకలేదని, హైదరాబాద్ కే వారు వచ్చి పోతుంటారు కాబట్టి వారి దిష్టి తెలంగాణకు తగిలిందని అన్నారు. మెదడు వాడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటూ పవన్ ను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ నుంచి కోనసీమకు ఎక్కువగా తెలంగాణ ప్రజలు వెళ్లరని..మాట్లాడేటప్పుడు నాలుకను అదుపులో పెట్టుకోకుండా, మెదడు వాడకుంటా ఈ తరహా వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు. కావాలంటే కోనసీమ కొబ్బరి తోటలలో దిష్టిబొమ్మలు పెట్టుకోవాలని పవన్ పై సెటైర్లు వేశారు. పవన్ వి పిచ్చి పిచ్చి మాటలని, తెలివితక్కువ మాటలని జగదీష్ రెడ్డి విమర్శించారు. మరి, జగదీష్ రెడ్డి కామెంట్లపై జనసేన నేతల స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Post

తారక్ 250 స్పీడ్ మీద డ్రైవ్ చేస్తాడాతారక్ 250 స్పీడ్ మీద డ్రైవ్ చేస్తాడా

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్సో ఆర్ఆర్ఆర్ టైంలో అందరికీ అర్థం అయింది. వీళ్ళ స్నేహానికి సంబంధించి ఆ టైంలో ఎన్నో విషయాలు బయటికి వచ్చాయి. ఐతే సినిమా ప్రమోషన్ కోసమే ఆ

టార్గెట్ 2028: విశాఖ‌పై బాబు స్ట్రాట‌జీ.. !టార్గెట్ 2028: విశాఖ‌పై బాబు స్ట్రాట‌జీ.. !

సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యం ఎప్ప‌టిక‌ప్పుడు ప‌దును పెరుగుతోంది. రోజురోజుకు ఆయ‌న త‌న ల‌క్ష్యాల‌ను మార్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధానంగా విశాఖ ప‌ట్నంపై మ‌రిన్ని ఆశ‌లు, ఆశ‌యాల‌తో సీఎం చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. గ‌తంలో వైసీపీ అధినేత‌, అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌.. విశాఖ‌ను

‘AA22xA6’: Allu Arjun-Atlee sci-fi enlists international choreographer Hokuto Konishi‘AA22xA6’: Allu Arjun-Atlee sci-fi enlists international choreographer Hokuto Konishi

The scale of Allu Arjun’s next project with director Atlee, tentatively titled ‘AA22xA6’, is proving to be truly global. Japanese-British dancer and choreographer Hokuto Konishi, a globally recognized figure for